అన్వేషించండి

Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

YSRCP MLC Zakia Khanam | తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదైంది.

case Filed against YSRCP MLC Zakia Khanam | తిరుమల: నిత్యం ఏదో విషయంతో తిరుమల వ్యవహారం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తిరుమలలో దర్శన టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం వెలుగుచూసింది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు విక్రయిస్తోందని జకియా ఖానంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరు వీఐపీ టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది.

శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేస్తున్నారని బెంగళూరుకు చెందిన భక్తుడు వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు విక్రయించడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం పేరు చేర్చారు. వీరితో పాటు ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 

ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫార్సుతో వచ్చిన ఆరు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ లో విక్రయించడంతో వివాదం మొదలైంది. అధిక ధరలకు శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్నారని భక్తుల టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. టీటీడీ విజిలెన్స్ వింగ్ సమాచారంతో తిరుమల టూ టౌన్ పీఎస్‌లో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదైంది.

దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా తిరుపతి వ్యవహారం
కొన్ని రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దమారం రేపాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా, స్వామివారికి అపచారం జరిగేలా ఎన్నో జరిగాయని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలకు వచ్చే ఏఆర్ డైరీ నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ లోని ఎన్‌డీడీబీకి పంపి టెస్టులు చేపించగా.. నెయ్యి కల్తీ అయినట్లు తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు సైతం చెప్పారు. అయితే అనుమానం వచ్చిన నెయ్యి శాంపిల్స్ ను లడ్డూ తయారీలో తాము వినియోగించలేదన్నారు. గతంలోనూ కల్తీ నెయ్యి తిరుమలకు రాగా, ఆ ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపించామని వైసీపీ నేతలు సైతం స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Embed widget