Top Headlines: పండుగ పూట ఏపీలో దారుణం - సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి రేవంత్ రెడ్డి, టాప్ హెడ్ లైన్స్
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. పండుగ పూట ఏపీలో దారుణ ఘటన
పండుగ రోజు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో వాచ్ మెన్, కొడుకును కత్తులతో బెదిరించి ఆయన భార్య, కొడుకు భార్యపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎస్పీ వెల్లడించారు. ఇంకా చదవండి.
2. ఏపీలో వైన్ షాపులకు భారీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల కోసం కోసం పోటీ భారీగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 వైన్‌షాపుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి ఏడు గంటల వరకు 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి ఏడు గంటలతో గడువు ముగిసింది. అయినా రాత్రి 12 గంటల వరకు డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల కారణంగా ప్రభుత్వానికి 1800 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎక్కువ దరఖాస్తులు ఎన్టీఆర్ జిల్లాలో వచ్చినట్టు సమాచారం. ఇంకా చదవండి.
3. భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో పలు రైళ్లు రద్దు
గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) (Bagmati Express) రైలు ఢీకొట్టిన ఘటన వల్ల పలు రైళ్లు దారి మళ్లించగా, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రద్దు చేసినట్లు ప్రకటించింది. డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు,, తిరుపతి- పుదుచ్చేరి మెము, డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము, అరక్కోణం- పుదుచ్చేరి మెము, విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్, తిరుపతి-అరక్కోణం మెము, తిరుపతి- డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము, అరక్కోణం- తిరుపతి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసిట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇంకా చదవండి.
4. సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. స్వగ్రామంలో దసరా వేడుకల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా కొండారెడ్డిపల్లిలో విజయదశమి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం హోదాలో రేవంత్ స్వగ్రామం రానుండటంతో కొండారెడ్డిపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సీఎం రాక కోసం గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చదవండి.
5. తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు
పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు పడింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా చదవండి.