Today Top Headlines: హర్యానాలో పడి లేచిన కెరటంలా బీజేపీ - ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ జరిగిన టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా కమలం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపించాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో దూసుకెళ్లిన కాంగ్రెస్ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంలు లెక్కింపు తర్వాత వైకుంఠపాళీ ఆటలో మాదిరిగా ఒక్కో సీటు తగ్గుతూ వచ్చింది కాంగ్రెస్. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. దాదాపు అరవైకిపైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది. ఈ దెబ్బకు బీజేపీకి 20 స్థాలైనా వస్తాయా అన్న అనుమానం కలిగింది. ఇంకా చదవండి.
2. తెలంగాణలో టీడీపీకి అంత ఈజీ కాదు!
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది జరిగి ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి వరకూ తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడ్ని నియమించలేకపోయారు. కానీ ఏపీలో టీడీపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ పార్టీ బలోపేతం చేస్తామని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు చంద్రబాబు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కనీసం పార్టీ అధ్యక్షుడ్ని నియమించడం లేదు. ఇంకా చదవండి.
3. జమ్మూకశ్మీర్‌లో బీజేపీకి షాక్
వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్ ఎలక్షన్స్ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టినా, ఆర్టికల్ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది. రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇంకా చదవండి.
4. ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. 2020-2023 మధ్య కాలంలో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చదవండి.
5. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది. అయితే ఉపరితల ఆవర్తనం తాజాగా బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు, ఉత్తర కేరళతో పాటు దక్షిణ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా చదవండి.