Top 5 Headlines Today: జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ - నేటి టాప్ 5 న్యూస్ మీకోసం
నేడు ఏపీ, తెలంగాణలో జరిగిన టాప్ 5 న్యూస్ మీకోసం..
జీవో నెంబర్-1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
జీవో నంబర్ 1 ఏపీ హైకోర్టు కొట్టేసింది. ప్రాథమిక హక్కులు కాలరాసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోదంటూ హైకోర్టు కామెంట్స్ చేసింది. రోడ్లపై బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం జనవరిలో ఈ జీవో నెంబర్-1ను తీసుకొచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు భంగరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కొత్తఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జీవో నెం.1 పెను సంచలనమే అయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు చనిపోయారు. దీంతో అలాంటి పరిస్థితి రాకూడదన్న కారణంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉందని విమర్శలు చేశాయి. ఇంకా చదవండి
చంద్రబాబు అధికారంలోకి వస్తే స్కీమ్‌లన్నీ ఎత్తేస్తారు - సీఎం జగన్
కావలిలో చుక్కల భూముల పంపిణీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎ జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సమస్య తీవ్ర తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం 2016లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించిందన్నారు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలన్న ఆలోచన చేయకుండా చంద్రబాబు రైతుల పొట్టకొట్టారన్నారు. ఇలా రైతులకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికి లేకుండా చేశారన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న తాను ఇబ్బందులను తొలగిస్తే తమపైనే అబండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా చదవండి
విశాఖపట్నం: కోడలు, మతిస్థిమితం లేని మనవరాలి బయటకు గెంటి తాళం వేసిన అత్త
మానసిక వికలాంగురాలు అయిన మనవరాలి వైద్యానికి డబ్బులు ఖర్చు చెయ్యాల్సి వస్తుందని కోడలితోపాటు ఇద్దరి మనవరాళ్లను ఎండలో వదిలి ఇంటికి తాళం వేసిందో అత్త. విశాఖలోని జయప్రకాశ్ నగర్‌లో ఉండే జగన్ మోహన్, గౌరీ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. బాధితురాలి బంధువులు చెబుతున్న దాని ప్రకారం గత కొంతకాలంగా జగన్ మోహన్ కుటుంబ కారణాల రీత్యా గౌరీదేవితో గొడవ పడుతున్నాడు. అందులోనూ మానసిక వికలాంగురాలు అయిన పెద్దకుమార్తె వైద్యం కోసం డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావడం కూడా భార్య గౌరీ దేవితో గొడవ పడడానికి కారణం అయింది. దానితో భార్యా పిల్లలను వదిలేసి తన తల్లి రాజేశ్వరితో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. ఇంకా చదవండి
హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో వెలుగులోకొస్తున్న సంచలన విషయాలు
ఇటీవల మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో 16 మందిలో 11 మంది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన వారు కాగా.. మిగతా ఐదుగురు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. అయితే అరెస్టయిన ఉగ్రవాదుల వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా చదవండి
చివరి క్షణంలో జేడీఎస్‌కు హ్యాండిచ్చారా? కుమారస్వామి అసంతృప్తి కేసీఆర్ మీదేనా?
కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియక ముందే జేడీఎస్ నేత కుమారస్వామి ఓ నిరాశజనకమైన ప్రకటన చేశారు. తమకు డబ్బులు లేకపోవడం వల్ల కనీసం పాతిక సీట్లలో గెలవలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న కుమారస్వామి ఇలా ఆర్థిక పరమైన అంశాలపై ఎందుకు పోలింగ్ ముగియగానే మాట్లాడారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. బీఆర్ఎస్ వైపు నుంచి అందుతుందనుకున్న సహకారం అందకపోవడం వల్లనే ఆయన ఈ అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకా చదవండి