అన్వేషించండి

Mahindra XUV700 SUV Latest Updates: మ‌హీంద్రా ఎక్స్ యూవీ 700 లెటెస్ట్ వెర్ష‌న్ లో కీల‌క మార్పు.. ఎల‌క్ట్రిక్ వెర్ష‌న్ లో ఎస్ యూవీని లాంచ్ చేయ‌నున్న కంపెనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన పిక్స్

త‌మ ఫేమ‌స్ మోడ‌ల్ అయిన ఎక్స్ యూవీ 700లో మ‌హీంద్రా కీల‌క మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా లాంచ్ చేయ‌న‌ప్ప‌టికీ, తాజాగా బ‌య‌ట‌ప‌డిన లీక్డ్ ఫొటోల నుంచి ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్ల‌డ‌య్యాయి. 

Mahindra XUV700 SUV Latest News:  మహీంద్రా తమ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన ఎస్ యూవీ 700కి తుది మెరుగులు దిద్ది, టెస్టింగ్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొత్తం మోడల్ క‌నిపించ‌క పోయిన‌ప్ప‌టికీ, తాజాగా టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారుకు సంబంధించిన పిక్స్ హ‌ల్చల్ చేస్తున్నాయి. కొత్త మోడ‌ల్ ఈవీకి సంబంధించిన‌దా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.  మహీంద్రా కంపెనీ ఫేమ‌స్ XUV700 SUV తాజాగా టెస్ట్ మ్యూల్ రూపంలో కనిపించడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎగ్జాస్ట్ పైప్ లేకపోవడంతో ఇది పెట్రో వెర్ష‌న్ కాదని నిపుణులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈ మోడల్‌కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ రావచ్చన్న సంకేతాన్ని ఇస్తోంది, ఇది ఆంతర్గ‌త‌ దహన (IC) వేరియంట్లతో పాటు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ కవర్ ఉన్నప్పటికీ, స్పై ఇమేజెస్ ఆధారంగా బయటికి వ‌చ్చిన స‌మ‌చారాన్ని బ‌ట్టి, మరింత పదునైన డిజైన్ లో దీన్ని రూపొందించార‌ని కనిపిస్తుంది. ఇందులో రీడిజైన్ చేసిన మల్టీ-స్లాట్ గ్రిల్, స్లీక్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, మార్పులు చేసిన LED DRLs, బంపర్లు, టెయిల్‌గేట్, టెయిల్ లాంపులు ,కొత్త అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవన్నీ facelift మోడల్‌కు ఆధునిక లుక్ ఇస్తాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అంతర్గతంగా, ఈ కొత్త మోడల్‌లో మూడు విడివిడిగా స్క్రీన్‌లతో కూడిన డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండనుందని తెలుస్తోంది.

కీల‌క మార్పులు..
ఈ డిజైన్ లో కీల‌క మార్పులు చేసిన‌ట్లు, బ‌య‌ట‌కు లీక్ అయిన ఇమేజెస్ ను బ‌ట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్యూయల్-స్క్రీన్ సెటప్‌కు బదులుగా, ఇందులో ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, ఒకటి డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం, మరొకటి కో-డ్రైవర్ డిస్‌ప్లే కోసం ఉండే అవకాశం ఉందని స‌మాచారం. ఇది మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ మోడల్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అదనంగా, రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, మరింత మెరుగైన ADAS సిస్టమ్ కూడా ఈ faceliftలో ఉండవచ్చని అంచనా. 

ముందుగా ఆ ర‌కంగా..
మహీంద్రా ముందుగా ఫేస్‌లిఫ్ట్ చేయబడిన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) XUV700 మోడల్‌ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అదే డిజైన్ కవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడతల వారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మెకానికల్‌గా, ఇందులో ఇప్పటిదాకా ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్ , 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లు కొనసాగే అవకాశం ఉందని స‌మాచారం. అలాగే మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్ లతో పాటు AWD (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది. ఏదేమైనా మ‌హీంద్రా కొత్త మోడ‌ల్ కు సంబంధించిన లీక్డ్ పిక్స్ కార్ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్
స్వయంగా బ్యాలెన్స్ చేసుకునే BMW ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ అవసరం లేని ప్రయాణం!
Bajaj Pulsar N250SS: రూ.1.59 లక్షలకే 25hp పవర్.. కొత్త పల్సర్ N250SSలో ఈ ఫీచర్లు అదుర్స్!
యూత్‌ కోసం బజాజ్ పల్సర్‌ కొత్త బైక్.. 6 స్పీడ్ గేర్‌బాక్స్, గూగుల్ మ్యాప్స్‌తో అట్రాక్ట్‌ చేస్తోంది!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget