Top Headlines: పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్ - హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. పవన్ కల్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఆగ్రహం
తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీ వెంకటేశ్వరస్వామి తగిన శిక్ష వేస్తారని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఇదే విషయంలో సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సనాతన ధర్మం అంటే సత్యంతో కూడిన పాలన అని.. కానీ దానిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటించలేదని విమర్శించారు. లౌకిక వాదమే ఈనాటి సనాతన ధర్మం అని గుర్తించాలన్నారు. ఇంకా చదవండి.
2. పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కామెంట్ల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డూ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించుకుందామంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా జస్ట్ ఆస్కింగ్ అంటూ కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ఓసారి, అందరికీ సమానత్వం ఎక్కడా డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ను చికాకు పెడుతూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇంకా చదవండి.
3. రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఎయిర్ పోర్ట్ రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం (అక్టోబర్ 4న) ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని తిరుపతి విమానాశ్రయ CISF క్రైమ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా చదవండి.
4. హైదరాబాద్ - గోవా కొత్త రైలు ప్రారంభం
సెలబ్రిటీలుగానీ, యువత, ఉద్యోగులు, వ్యాపారులు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. బట్ సెలబ్రిటీలకు, సౌండ్ పార్టీలకు గోవా ట్రిప్ ప్లాన్ చేయడంతో పాటు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఈజీగా వెళ్లొస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గోవాకు వెళ్లే రైలును ఆదివారం నాడు ప్రారంభించారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంగ్లీష్ మీడియాలకు దీటుగా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి నర్సరీ నుంచి ఇంటర్ వరకు మెరుగైన ఉచిత విద్య అందిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు ఇప్పటివరకూ సొంత భవనాలు లేవని, ఇరుకైన బిల్డింగ్స్ లో ఈ స్కూళ్లు ఉన్నాయన్నారు. ఇంకా చదవండి.