Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం
Andhra Pradesh News | రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Renigunta Airport: తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఎయిర్ పోర్ట్ రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం (అక్టోబర్ 4న) ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని తిరుపతి విమానాశ్రయ CISF క్రైమ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కలియుగ దైవం తిరుమల (Tirumala Temple) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి, విదేశాల నుంచి సైతం భక్తులు తిరుపతికి వస్తుంటారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అటు నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు చేరుకుంటారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీఐపీలు, వీవీఐపీలు చాలా వరకు తిరుపతి ఎయిర్ పోర్టు (Tirupati Airport)లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారని తెలసిందే. ఇటీవల తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అనే అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించి దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే. ఇలాంటి సున్నితమైన అంశాలపై దర్యాప్తు చేపట్టిన తరువాతే ప్రజలకు నిజాలు చెప్పాలని, వదంతులు ప్రచారం చేయకూడదని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
Also Read: Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్