TTD EO : టీటీడీ మొదటి ఈవో ఎవరు? నాటి నుంచి అనిల్‌కుమార్ వరకు జరిగిన మార్పులేంటీ?
Who is First TTD executive officer:టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది. అసలు ఈ టీటీడీ ఈవోల వ్యవస్థ ఎప్పటి నుంచి ఉంది? మొదటి ఈవో ఎవరో ఇక్కడ చూద్దాం.

TTD EO : తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవోగా అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న జె. శ్యామలరావు స్థానంలో అనిల్‌ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో అనిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకొని వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ప్రభుత్వం తిరుమలలో పూర్తి ప్రక్షాళన కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి టైంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న చర్చ మొదలైంది.
అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోల నియామకం ఎప్పటి నుంచి మొదలైంది. మొదటి ఈవో ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారన్న సంగతి చాలా మందికి తెలియదు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన విధానం ద్వారానే ఈవోలను నియమించారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.
బ్రిటిష్ కాలం నుంచే టీటీడీ స్వతంత్ర వ్యవస్థగా ఉండేది. నాటి చట్టాల ప్రకారం 1933 నుంచి ఈ టీటీడీ పాలనా బాధ్యతను కమిషనర్లు చూసుకునే వాళ్లు. అంతకు ముందు హతిరామ్‌జీ మఠం ఈ దేవాలయ పాలనా బాధ్యతలు చూసేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1951వ సంవత్సరం టీటీడీ చరిత్రలో మలుపుగా చెబుతారు.
టీటీడీ 1932లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం ద్వారా టీటీడీ యాక్ట్ ప్రకారం స్థాపించారు. ఈ యాక్ట్ 1933 ఆగస్టు 30న అమలులోకి వచ్చింది. మొదటి కమిషనర్‌గా ఎ.ఆర్. పంచపగేస అయ్యర్ నియమితులయ్యారు.1933 నుంచి 1937 వరకు సేవ చేశారు. ఆయన్నే టీటీడీ మొదటి ఈఓగా పరిగణిస్తారు. కొన్ని చోట్ల అధికారిక ఈవోగా చెలికాని అన్నా రావు అని ఉంది. ఈయన మొదటి ఈవో, ఛైర్మన్‌గా పని చేశారని చెబుతున్నారు.
ఆ తర్వాత కాలక్రమేణా ఈఓ పాత్ర మారింది. టీటీడీ బోర్డు ఏర్పడింది. మొదట్లో 7 మంది సభ్యులతో ఏర్పడింది. ఆలయ ఆస్తులు, భక్తుల సేవలు మొదలైనవి నిర్వహించే వాళ్లు. టీటీడీ చరిత్రలో ముఖ్యమైన మార్పులు: 1969లో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండావ్‌మెంట్స్ యాక్ట్ ద్వారా ట్రస్టు సభ్యుల సంఖ్య 11కి పెరిగింది. 1987లో మరో యాక్ట్ ద్వారా గరిష్టంగా 15 మంది సభ్యులు నియమితులయ్యారు. అలా మారుతూ వస్తోంది.
చెలికాని అన్నారావు తొలి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టినట్టు టీటీడీ రికార్డుల్లో ఉంది. ఆయన కేవలం ఈవోగానే కాకుండా ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1951 నుంచి 1954 వరకు మొదటి ఈవోగా, ఛైర్మన్‌గా పని బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే 26వేల రూపాయలతో మెట్ల మార్గం నిర్మాణం మొదలైంది.
అన్నారావు తర్వాత చాలా మంది ఈవోలుగా పని చేశారు కానీ పీవీఆర్‌కే ప్రసాద్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కొత్త సంస్కరణలతో ఈవో పవర్‌ను పరిచయం చేశారు. భక్తులకు ఎలాంటి సౌకర్యలు కల్పించవచ్చు. ఎలాంటి మార్పులు చేయవచ్చు అనేది చేసి చూపించారు. పీవీఆర్కే ప్రసాద్ 1978నుంచి 1982 వరకు ఈవోగా పని చేశారు. ఆయన కాలం నుంచి ఐఏఎస్ అధికారులను ఈవోలుగా నియమించే సంస్కృతి మొదలైంది.
టీటీడీ ఈవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో 28మంది ఈవోలు పని చేశారు. కొందరు వివాదాలతో ఫేమస్ అయితే మరికొందరు సంస్కరణలతో తమ పేరును కొండపై చెరగని సంతకంలా మార్చేశారు. వివిధి జల్లాల్లో కలెక్టర్లుగా పని చేసిన ఎంతో మంది ఏడుకొండలవాడి సేవలో తరించారు. అయితే అప్పటి వరకు దక్షిణాది వాళ్లు మాత్రమే ఈ పదవిని చేపడుతూ వచ్చారు. కానీ 2017లో తొలిసారిగా ఉత్తరాది అధికారికి ఈవో బాధ్యతలు అప్పగించి నాటి ప్రభుత్వం
అనిల్ కుమార్ సింఘాల్ అనే 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని 25వే ఈవోగా 2017లో నాటి ప్రభుత్వం నియమించింది. ఆయన చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనే శ్రీవాణి ట్రస్ట్ విరాళాలతో వీఐపీ దర్శన వ్యవస్థను తీసుకొచ్చారు. తిరుమలేశుడి సేవలను చాలా వరకు డిజిటలైజేషన్ చేశారు. అయితే ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితుల తొలగింపు, దేవాలయభూముల వేలం లాంటి నిర్ణయాలు నాటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు మళ్లీ టీటీడీలోకి ఆయన అడుగు పెడుతున్నారంటే... పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ మొదలైంది.





















