Breaking News: భక్తుల తోపులాట - తిరుమలలో 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - ఎప్పటి నుంచి ఎప్పటివరకో తెలుసా !
TTD cancels VIP Break Darshan: 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
![Breaking News: భక్తుల తోపులాట - తిరుమలలో 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - ఎప్పటి నుంచి ఎప్పటివరకో తెలుసా ! VIP Break Darshan: TTD cancels VIP Break Darshan from 13th April to 17th April 2022 Breaking News: భక్తుల తోపులాట - తిరుమలలో 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - ఎప్పటి నుంచి ఎప్పటివరకో తెలుసా !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/12/880c19adef1db58176305455672f0f3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీవారి భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అధిక రద్దీ కారణంగా రేపటి నుంచి ( బుధవారం) నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేటి ఉదయం ఆలయంలో సర్వదర్శనం టోకెన్ కేంద్రాల వద్ద తోపులాట జరగడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. ముఖ్యంగా చిన్నారులు, వయసు పైబడిన వాళ్లు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చేతులెత్తేసిన టీటీడీ.. బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కేటాయించే కేంద్రాలు వద్ద భక్తులను అదుపు చేయలేక టిటిడి చేతులు ఎత్తేసింది. అధిక సంఖ్యలో భక్తుకు తిరుపతికి చేరుకోవడంతో దర్శనం టిక్కెట్లు లేకపోయినా భక్తులను తిరుమలకు అనహమతిస్తోంది టిటిడి. టిక్కెట్లు లేని భక్తులను ఆధార్ కార్డు పరిశీలించి సర్వదర్శనం గుండా దర్శనానికి పంపేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు రేపటి నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.
రాత్రి నుంచి టికెట్ల కోసం భక్తుల ఎదురుచూపులు..
నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. పాఠశాలలకు మధ్యాహ్నం సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. తిరుపతిలో స్వామి వారి సర్వదర్శనాల టిక్కెట్లను రైల్వే స్టేషన్ కు సమీపంలోని గోవిందరాజ స్వామి సత్రాలు, బస్టాండు సమీపంలోని శ్రీనివాసం, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ వద్ద కేటాయిస్తోంది టీటీడీ.
అధిక రద్దీ నేపధ్యంలో ఈ నెల తొమ్మిదోవ తారీఖునే 12కి సంబంధించిన టోకెన్ల (Sarva Darshan Tickets At Tirumala)ను జారీ చేసింది. ఆపై రెండు రోజుల పాటు ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో టిక్కెట్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈక్రమంలో ఈనెల 13వ తేదీకి సంబంధించిన టోకెన్ల ప్రక్రియ నేటి ఉదయం నుండి ప్రారంభించింది. దీంతో పెద్దయెత్తున భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకోవడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో క్యూలైన్స్‌లో ఉన్న చంటిబిడ్డలు, వయోవృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఊపిరి ఆడక స్వామి దర్శనం మాకు వద్దంటూ వెను తిరిగారు.
Also Read: Zodiac Signs : ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)