TTD Darshan Tickets: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల, మొరాయించిన సర్వర్ - సమయం మార్పు
ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. మార్చి మాసానికి సంబంధించిన tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్ సైట్లో విడుదల చేస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొవిడ్ కారణంగా టిక్కెట్లు పొందిన భక్తులను మాత్రమే కొండకు అనుమతిస్తోంది టీటీడీ. ఇలా రెండు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం దివ్య దర్శనం టోకెన్లను జియో క్లౌడ్ మేనేజ్‌మెంట్ ద్వారా టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. గతంలో భారీగా డిమాండ్ రావడం ద్వారా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ టికెట్లు విడుదల చేసిన ఆ సమయంలో సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో జియో సహకారం అందించడంతో సాంకేతికంగా ఏర్పడిన సమస్యను తొలగించి భక్తులకు క్లౌడ్ మేనేజ్‌మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పించింది.
ఇక శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. మార్చి మాసానికి సంబంధించిన tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్ సైట్లో విడుదల చేస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతూ టీటీడీ నిన్న నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా రేపటి నుండి ఈ నెల 28 వరకు రోజుకు 13 వేల ప్రత్యేక ప్రవేశం దర్శన టికెట్లు ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా, ఆఫ్ లైన్ ద్వారా అదనంగా మరో 5 వేల సర్వ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
అలాగే మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 25 వేల చొప్పున ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా, ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 20 వేల సర్వ దర్శనం టికెట్లను విడుదల చేసింది. రోజులో శ్రీవారి సామాన్య భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీ గోవిందరాజ స్వామి సత్రంలో బయోమెట్రిక్ ద్వారా భక్తులకు టిక్కెట్లు జారీ చేస్తుంది. అయితే ఇవాళ ఉదయం 9 గంటలకు 300 రూపాయల దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. అయితే దర్శన టోకెన్లు పొందేందుకు సైట్‌కు భారీ హిట్లు రావడంతో ఒక్కసారిగా సర్వర్ సమస్య తలెత్తింది. దీంతో భక్తులు నగదు జమ చేసే విషయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తింది. దీంతో ఉదయం 11 గంటలకు దర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.