By: ABP Desam | Updated at : 08 Feb 2023 08:44 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు గల వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టిటిడి విడుదల చేయనుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత సేవలైన (వర్చువల్ పార్టిసిపేషన్) కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాతోపాటు, ఈ సేవల ద్వారా లభించే దర్శన కోటాను ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి http://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది.
హుండీ ఆదాయం ఎంతంటే
శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణ స్ధితికి చేరుకుంది.. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు.. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసంను అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటాలో సమర్పిస్తారు.. మంగళవారం రోజున 65,297 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 23,975 మంది తలనీలాలు సమర్పించగా, 3.87 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు 08 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు, సూచనల మేరకు టిటిడి రద్దు చేసింది.. కేవలం ఏడాదికి ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం టిటిడి నిర్వహిస్తొంది.. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.
సాయంకాలం సహస్రదీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.. నిత్య సేవల్లోభాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకారసేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. అటుతరువాత ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. రాత్రి కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
Tirumala Darshan News: ఏడుకొండలపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శన సమయం ఎంతంటే
Nara Lokesh: ఇక మిగిలింది వై నాట్ పులివెందుల! నా తల్లినే అవమానిస్తారా, మిమ్మల్ని వదిలిపెట్టను!: నారా లోకేశ్
Elephant Electrocuted Video : తమిళనాడు ధర్మపురిలో విషాదం, విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలిన ఏనుగు!
Chandrababu: ‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ, అక్కసుతో ఆర్ధరాత్రి అరెస్టు చేయిస్తావా?’ చంద్రబాబు ధ్వజం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్