News
News
వీడియోలు ఆటలు
X

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టిటిడి ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

FOLLOW US: 
Share:

Tirumala Tirupati Devasthanam 2023-24: 2023-24 సంవత్సరానికి రూ.4,411 కోట్ల అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్ (TTD Budget 2023-24) కు ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం (మార్చి 22) ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ఐతే ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.  

2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్ కు (TTD Budget 2023-24) టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి, భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తాంమని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.  

(TTD Board) వీటికి పాలక మండలి ఆమోదాలు

తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయింపునకు గానూ పాలక మండలి (TTD Board) ఆమోదం తెలిపిందని, అంతే కాకుండా తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు.

ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి (Vontimitta Brahmotsavam 2023) సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నామని, కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఏఫ్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారి చేసే వారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విఐపీ బ్రేక్ దర్శనాల (TTD VIP Break Darshan Time) సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తామని, త్వరలోనే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలియజేశారు.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని (Tirumala Latest News) పలువురు ప్రముఖులు నేడు (మార్చి 22) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ (VIP Break Darshan) సమయంలో ఎమ్మెల్యే పేర్ని నాని, టీటీడీ బోర్డు మెంబర్ మొరం శెట్టి రాములు, సినీ నటుడు సాయి వెంకట్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

Published at : 22 Mar 2023 12:52 PM (IST) Tags: TTD Chairman YV SUBBAREDDY TTD Budget Tirumala Budget TTD 2023-24 Year Budget

సంబంధిత కథనాలు

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?