Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
TTD News: రాష్ట్ర ప్రభుత్వ సమానమైన వ్యవస్థలో సమాచారం ఇవ్వడం లేదు. గతంలో జరిగిన తప్పిదాలను బహిర్గతం చేయడానికి ఇప్పుడు ఉన్న అధికారులు ఎందుకు సాహసించడం లేదు?
Tirumala News: తిరుమల శ్రీవారి పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. నిత్యం గోవిందా నామ స్మరణతో మారుమోగుతుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సమానమైన వ్యవస్థ కలిగిన టీటీడీలో చిత్రమైన పరిస్థితి ఉంది. ఆ విషయానికి సంబంధించైనా వివరాలు వెల్లడించడానికి ప్రభుత్వమేదైనా వెనకడుగు వేస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉన్న ఇక్కడ ఏమి చేయాలన్న ప్రభుత్వం నియమించే ఐఏఎస్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పాలకమండలి సైతం నిర్ణయం ఆయితే తీసుకుంటారు కాని అమలు చేయాల్సింది మాత్రం అధికారులు. రాష్ట్ర ప్రభుత్వంతో పోటీ పడి మరీ ఏడాది బడ్జెట్ టీటీడీ ప్రవేశ పెడుతుంది. ఇలాంటి ధార్మిక సంస్థలో నిధులు వివరాలు వెల్లడించడానికి టీటీడీ వెనుకడుగు వేస్తుంది. వచ్చే ఆదాయం గురించి చెబుతుంది కానీ ఖర్చులపై మాత్రం నీళ్లు నములుతుంది. ఈ ఖర్చుల వివరాలు తెలియకుండా లోపల ఏం జరుగుతుందో అనేది ఎలా తెలుస్తుందని చాలా మంది అడుగుతున్న ప్రశ్న.
5 సంవత్సరాల పాటు నిర్ణయాలు ఏవి?
రాష్ట్రంలో 151 సీట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ టీటీడీని ఐదేళ్ల పాటు రూల్ చేసింది. నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి, సమీప బంధువైన భూమన కరుణాకర్ రెడ్డికి బోర్డు అధ్యక్షులుగా పని చేశారు. బోర్డులో ఎన్నడూ లేని విధంగా జంబో బోర్డు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా ఆ ప్రక్రియ కొంత కాలానికి ఆగిపోయింది. ఐదేళ్ల పాటు టీటీడీలో తీసుకున్న అనేక నిర్ణయాలు టీటీడీ వెబ్ సైట్‌లో పెట్టలేదు. టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో పెడతారు. ఏదైన ఎవరికైన కావాలంటే అందులో చూసుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలో జరిగిన అనేక బోర్డు సమావేశాల నిర్ణయాలు వెల్లడించలేదు. నాటి టీటీడీ ఇన్ఛార్జి ఈవో, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వీటిని వెబ్ సైట్‌లో పెట్టనివ్వకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత 2024లో ఏర్పాటు చేసిన బోర్డు సమావేశంలోని కొన్ని నిర్ణయాలను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో నాటి బోర్డు తీర్మానం, టెండర్ ఆమోదం, నెయ్యి ఇతర వస్తువుల ధరలు అందుబాటులో లేవు. దీనిపై ఇప్పుడు ఉన్న టీటీడీ అధికారులు అయిన వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ తప్పు చేసింది అని చెబుతున్నారు తప్ప ఎక్కడా రికార్డుల్లో మాత్రం చూపడం లేదు. పాత విషయాలు మాట్లాడను అంటూ ఈవో తప్పించుకుంటున్నారు.
సమాచార హక్కు చట్టం
సాధారణంగా ప్రభుత్వ, అనుబంధ సంస్థలు సమాచార హక్కు చట్టాన్ని తప్పక అనుసరించాలి. సమాచారం ఇవ్వని అధికారులకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. టీటీడీ ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో సమాచార హక్కు చట్టం లేకుండా ప్రభుత్వం పూర్వం నిర్ణయం తీసుకుంది. అది ఉంటే ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో నీజాలు వెల్లడి అయ్యే అవకాశం ఉండేదని భక్తుల వాదన. టీటీడీలో ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తే ప్రతి రోజు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి.
Also Read: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం