News
News
వీడియోలు ఆటలు
X

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ

Tirumala Hundi Income: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే(శుక్రవారం) స్వామి వారిని 61 వేల 425 మంది దర్శించుకోగా... 3.01 కోట్ల హుండీ ఆదాయం నెలకొంది. 

FOLLOW US: 
Share:

Tirumala Hundi Income: టీటీడీ ఇవాళ్టి నుంచి దివ్యదర్శనం టోకెన్ల జారీ తిరిగి ప్రారంభించనుంది. కొండపైకి నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం టికెట్లను వారం రోజుల పాటు జారీ చేయనుంది. ఈ ప్రయోగాత్మక ప్రక్రియలో లోపాలను సవరించి తర్వాత పూర్తిస్థాయిలో జారీ చేసే విధానం తీసుకురానున్నారు. అలిపిరి కాలిబాట మార్గంలో పదివేల టికెట్లు, శ్రీవారి మెట్టు దారిలో ఐదువేల టికెట్లు జారీ చేయనున్నారు. 

తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం రోజున 61,425 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26,430 మంది తలనీలాలు సమర్పించగా.. 3.01 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 14 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.

నల్ల నువ్వుల బెల్లంతో కలిపిన ప్రసాదం

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకున్నారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదన సమర్పించిన అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదంను స్వామి వారిని నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు. దీనినే కైంకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు.

బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు.. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం జరిపిస్తారు. 

శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి

అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. 

శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పఠనం

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన చేస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. ఆ తర్వాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.అనంతరం  శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

Published at : 01 Apr 2023 08:51 AM (IST) Tags: AP News TTD Tirumala Tirumala Rush TTD Hundi

సంబంధిత కథనాలు

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

టాప్ స్టోరీస్

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?