Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు
Tirumala Garuda Seva: సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
TTD Garuda Seva: తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. మే 16న (సోమవారం) రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. నాలుగు మాఢ వీధులు గోవింద నామ స్మరణలతో మారుమోగాయి.
వర్షాన్ని లెక్కచేయని భక్తులు
ఓ వైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మాఢవీధులోని గ్యాలరీలో భక్తులు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని పునీతులు అయ్యారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ (Pournami Garuda Seva performs at Tirumala Temple) అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేయుచన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. #Tirumala #TTD pic.twitter.com/NObolBY8X7
— ABP Desam (@ABPDesam) May 16, 2022
హిమాలయాలను తలపించిన తిరుమలగిరులు..
తిరుపతి : వేసవికాలంలోనూ తిరుమలగిరులు హిమాలయాలకు తలపిస్తున్నాయి. ఓవైపు చిరుజల్లులు, మరోవైపు భారీగా అలుముకున్న మంచి దుప్పట్టి తిరుమలను కమ్మేసింది. ఓవైపు ఉదయం మండుటెండలు.. అనంతరం ఉక్కపోతతో ఉక్కిటిబిక్కిరి అయ్యే సమయంలో తిరుమలకు వచ్చిన భక్తులు చల్లటి వాతావరణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఒక్కసారిగా కురిసన వర్షంతో స్వల్ప ఇబ్బందులు ఉన్నా వేసవి కాలంలో కురిస్తున్న మంచు లాంటి తుంపరులు ఆస్వాదిస్తూ... స్వామి వారి దర్శనానికి వస్తే బోనస్ గా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతున్నారు శ్రీవారి భక్తులు.
Also Read: Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !