Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Nellore to Kanyakumari Cycle Ride: తన గురువు సూర్యప్రకాష్ అధిరోహించి నాలుగేళ్లు అయిన సందర్భంగా నెల్లూరుకు చెందిన తేజ నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ మారథాన్ సైకిల్ రైడ్ ప్రారంభించాడు.
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు కుర్రాడు 1500 కిలోమీటర్ల మేర మారథాన్ సైకిల్ యాత్రకు నేడు శ్రీకారం చుట్టాడు. సాధారణంగా ఏదో సైకిల్ యాత్ర అనుకుంటున్నారా కానే కాదు. ఈ మారథాన్ సైకిల్ యాత్రకు ఓ అర్థం ఉంది. ఓ సామాజిక కోణాన్ని నెల్లూరు కుర్రాడు స్పృశించబోతున్నాడు. సూర్యప్రకాష్ అడ్వెంచరస్ అకాడమీకి చెందిన తేజ అనే కుర్రాడు సోమవారం (మే 16న) ఈ మారథాన్ సైకిల్ రైడ్ ప్రారంభించాడు. నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 1500 కిలోమీటర్లు సాగే ఈ ప్రయాణంలో ప్రతి కిలోమీటర్‌కు ఓ మొక్కను నాటుతూ వెళ్లనుండటమే ఈ సైకిల్ యాత్ర ప్రత్యేకత.
గురువు ఘనతకు నాలుగేళ్లు..
నెల్లూరుకు చెందిన సూర్యప్రకాష్ ప్రముఖ పర్వతారోహకుడు. ఇప్పటికే ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను ఆయన అధిరోహించాడు. ఆయన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి నేటికి నాలుగేళ్లు అవుతోంది. తన గురువు సూర్యప్రకాష్ ఎవరెస్ట్ అధిరోహించి నాలుగేళ్లు అయిన సందర్భంగా తేజ అనే యువకుడు నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు 1500 కి.మీ మేర మారథాన్ సైకిల్ యాత్ర (Nellore to Kanyakumari Cycle Ride)కు శ్రీకారం చుట్టాడు. పచ్చదనంపై అవగాహన పెంచుతూ ప్రతి కిలోమీటర్ కి ఒక మొక్క నాటుతూ వెళ్తాడు తేజ. అడ్వంచరెస్ అకాడమీ నిర్వాహకుడు సూర్యప్రకాష్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్లు చెబుతున్నాడు తేజ.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ట్రిబ్యూట్..
సూర్యప్రకాష్ అడ్వెంచరస్ అకాడమీ తరఫున తాను నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు మొక్కల పెంపకంపై అవగాహన పెంచుతూ 1500 కి.మీ మేర ప్రయాణం కొనసాగుతుందని రైడర్ తేజ తెలిపాడు. ప్రతి కి.మీ ఓ మొక్కను నాటిస్తూ సామాజిక అంశాన్ని పెంపొదిస్తూ తమ అకాడమీ గురించి చాటి చెబుతా అంటన్నాడు. తన గురువు సూర్యప్రకాష్ ఎవరెస్ట్ అధిరోహించి 4 ఏళ్లు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ సైకిల్ రైడ్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబుకు తన ట్రిబ్యూట్ అని చెప్పాడు.
యువత తమ దారి తమకే అని భావించే వారికి వారి ఆలోచన తప్పు అని నిరూపిస్తున్నాడు నెల్లూరు కుర్రాడు. సామాజిక అంశాలలో బాధ్యత తీసుకోవడంలో యువత ఎప్పుడు ముందుంటుందని తమ జిల్లా వాసి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !