అన్వేషించండి

Tirumala Laddu: తిరుమల లడ్డూలకు నాసిరకం నెయ్యి సప్లై, వారిపై చర్యలు, ఇకపై మంచి రుచి -ఈవో

TTD News: శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంచతామన టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Tirumala News: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో జే.శ్యామలరావు తెలిపారు. ఈ చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.
 
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం (జూలై 23) శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.  

నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో ఎన్‌డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని అన్నారు. ఈ కమిటీ వారం రోజులలో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశా నిర్దేశం చేస్తుందని అన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు.

‘‘ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించాం. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు. మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో తేలింది’’ అని అన్నారు.

టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపినట్లు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని.. కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాం, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Sankranthiki Vasthunam : వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్‌ యువకుడు మృతి
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్‌ యువకుడు మృతి
Embed widget