News
News
X

Notla Parakamani: శ్రీవారి హుండీ లెక్కింపు చూడాలనుందా? అద్భుత అవకాశం కల్పించిన టీటీడీ

బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది.

FOLLOW US: 
Share:

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి ప్రారంభించారు. ముందుగా ఉదయం 9 గంటల నుండి నూతన పరకామణి భవనంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి తీసుకుని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు.  

బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది. గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 28న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఈ నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఈ భవనంలో అభివృద్ధి పనులను టిటిడి చేపట్టింది. శ్రీవారి దర్శనార్శం తిరుమలకు విచ్చేసిన భక్తుడు స్వామి వారికి సమర్పించే కానుకల లెక్కింపు స్వయంగా వీక్షించే విధంగా భవనంకు నలువైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టిటిడి. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన పరకామణి భవనంను ప్రారంభించడం జరిగిందన్నారు.  

ఈ నూతన పరకామణి భవనంలో అన్ని సిబ్బందికి అవసరం అయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని, అయితే ఇవాళ 12 హుండీలను శ్రీవారి ఆలయం నుండి నూతన పరకామణికి తరలించి, లెక్కింపు ప్రక్రియను ప్రారంభించామన్నారు. అయితే ముందస్తుగా హుండీ కానుకలను పరకామణికి తరలించేందుకు ట్రయల్ రన్ చేశామని, నేడు అది సక్సెస్ పుల్ అయిందని అన్నారు. రేపటి నుండి హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో లెక్కించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రస్తుత పరకామణిలో భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోడానికి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. 

స్వామి వారి హుండీ కానుకల లెక్కింపు భక్తులు వీక్షించే విధంగా ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి రోజు దాదాపుగా 12 నుండి 13 హుండీలు పరకామణికి వస్తాయని, ఏ రోజుకు ఆ రోజు హుండీ కానుకలను లెక్కించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి నిత్యం 225 మంది సిబ్బంది పరకామణి విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలియజేశారు.

Published at : 05 Feb 2023 03:11 PM (IST) Tags: Tirumala Temple TTD EO Tirumala Hundi Tirumala Hundi Income new Notla Parakamani

సంబంధిత కథనాలు

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?