అన్వేషించండి

Balaji Institute of Oncology: రూ.124 కోట్లతో క్యాన్సర్ హాస్పిటల్ - టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన

Balaji Institute of Oncology: 124 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ ఆస్పత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 

Balaji Institute of Oncology: 124 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ ఆస్పత్రి నిర్మాణ‌ పనులు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర ఇన్సిటిట్యూట్ ఆవరణలో శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో మన రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దాదాపు 124 కోట్ల రూపాయలతో ఈ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈరోజు కీలకమైన బంకర్ బ్లాక్ శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు.

200 కోట్ల రూపాయలతో అత్యాధునిక యంత్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు నిర్మాణఁ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ రాకుండా తీసుకొవా ల్సిన జాగ్రతలు, టెస్టులు, పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి జిల్లాకు పింక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లా నలుమూలలకు పింక్ బస్సులు పంపించి, స్క్రీనింగ్ చేస్తున్నామని వెల్లడించారు. మూడు లక్షల ఏస్.ఎఫ్.టీలతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే మొత్తం 400 పడకల కెపాసిటీతో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

ఆస్పత్రికి శంకుస్థాపనం చేసిన తర్వాత ఇటీవలే తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడికి ఛైర్మన్ సుబ్బారెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా వెళ్లారు. ఈక్రమంలోనే బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమలలో కిలో‌మీటర్ల మేర భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. బుధవారం రోజు 74,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,663 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, స్వామి వారి హుండీ ఆదాయం 3.60 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget