Tirumala Srivaru: నేడు తిరుమలలో నిర్వహించే పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇవే
Tirumala Srivaru: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ఈ రోజు చేయబోయే ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకందాం.ఉదయం నుంచి రాత్రి వరకు చేయబోయే పూజల గురించి చూద్దాం.
Tirumala Srivaru: తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళ వారం ప్రత్యూష కాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరిచారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్న ప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ఆ తర్వాతే వీఐపీ భక్తులకు దర్శనం..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించింది. ఆ తర్వాత వీఐపీ భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడి. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల పరిరక్షణకై టిటిడి రద్దు చేసింది. కేవలం ఏడాదికి ఓ మారు సర్కారు వారి సహస్ర కళషాభిషేకాన్ని నిర్వహిస్తొంది. అనంతరం సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.
డోలోత్సవం, ఊంజల్ సేవలు..
ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించారు. అటు పిమ్మట ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు జరిపిస్తారు. సాయం కాలం సహస్ర దీపాలంకార సేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. దీని తర్వాత సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికు అనుమతిస్తారు. అనంతరం తిరుమలలో పల్లవోత్సవంను టీటీడీ అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు.
ఘనంగా పల్లవోత్సవం నిర్వహణ...
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూ వస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.