TTD Issue: అలిపిరి వద్ద రోడ్డు పక్కన విగ్రహం - మరోసారి టీటీడీ కేంద్రంగా రాజుకున్న రాజకీయం !
Tirupati: తిరుపతిలో అలిపిరి వద్ద పడిపోయి ఉన్న ఓ రాతి విగ్రహం చుట్టూ రాజకీయం ప్రారంభమయింది. అది విష్ణువు విగ్రహమని టీటీడీ తప్పిదమని భూమన ఆరోపించారు. బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirupati Politics on TTD: తిరుమల తిరుపతి దేవస్థానాలను రాజకీయాలు వదిలి పెట్టడం లేదు. తాజాగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి వద్ద ఓ విగ్రహం పడి ఉందని .. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిరక్ష్యం జరిగిందన్నారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ ఆ విగ్రహం ఉంది.
టీటీడీ చైర్మన్ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ...తిరుమల పవిత్రత టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు కి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చాడని.. శిల్పం తయారీలో లోపం రావడంతో.....ఆ రాతివిగ్రహం అక్కడ పడేశారని.. గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది....నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రక్కా ప్లాన్ ప్రకారం ఆ విగ్రహం చుట్టుప్రక్కల నిన్న రాత్రి మద్యంసీసాలు పడేసి... పనిగట్టుకొని టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. గతంలో శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవవిగ్రహానికి వేలు విరిగిపోయింది ..మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపానపోలేదు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మత్తు చేశాన్నారు. స్వామివారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉన్న నువ్వా..? హిందుత్వం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.
అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని మరో బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఇంట్లో ఆచరించే మత విశ్వాసాలు వేరు...బయట రాజకీయ ఉనికి కోసం, ధనర్జాన కోసం హిందువుడిలా కరుణాకర్ రెడ్డి నటిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం, మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో....భూమన కరుణాకర్ రెడ్డి దిగజారిపోయారని మరో సభ్యుడు దివాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక...అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగట్టుకున్నారని.. మహావిష్ణువు విగ్రహానికి.... అసంపూర్ణమైన శనిభగవానుడి విగ్రహానికి తేడా తెలీదని విమర్శించారు. ఇలాగే ఉంటే.... కరుణాకర్ రెడ్డిని ప్రజలు తిరగబడి తరమికొట్టడం ఖామమని మరో సభ్యురాలు పనబాక లక్ష్మి విమర్శించారు.
అది శనేశ్వరుడి విగ్రహం - 22 ఏళ్లుగా అక్కడే : స్థపతి
అలిపిరి సమీపంలో ఉన్న విగ్రహం శనేశ్వరుడిది అని 22 సంవత్సరాల నుండి అక్కడే ఉందని స్తపతి గురుస్వామి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాయచెరువు రోడ్డు లో తాము నివాసం ఉండగా విగ్రహం సిద్దం చేశామని.. ఆ విగ్రహం తయారు చేయమని ఆర్డర్ ఇచ్చిన ఆ దాత మరణించారు. ఆ స్థలం సరిపోకపోవడంతో అక్కడి నుంచి అలిపిరి మార్చామన్నారు. బాంబు దాడి ఘటన అనంతరం అక్కడి నుంచి ఖాళీ చేయించారని.. దీంతో చిన్న విగ్రహాలను తీసుకుని ఆ విగ్రహాం అక్కడే వదిలేసి వెళ్లామని తెలిపారు.
అది విష్ణువు విగ్రహమే : భూమన
వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారని భూమన ఆరోపిచారు. ఆది శనీశ్వర విగ్రహం అని చెప్తున్నారు. శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనీశ్వర విగ్రహము అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆది శిల్పి చెక్కి పడేశారు అని నిరక్ష్యంగా పడేశారు నిరక్ష్యపు సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. నాపై తప్పుడు కేసు పెట్టీ, జైల్లో వేసినా నేను చెప్తూనే ఉంటానన్నారు. తాను హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని, నాపై ఎన్ని సార్లు దుష్పచారం చేసిన ఎవ్వరు నమ్మరన్నారు.





















