అన్వేషించండి

Tirumala Hundi Income: తిరుమలలో భక్తుల సాధారణ రద్దీ, నిన్న హుండీ ఆదాయం 4.78 కోట్లు!

Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. నిన్న76 వేల 821 మంది స్వామిని దర్శించుకోగా.. 4.78 కోట్ల కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. 

Tirumala Hundi Income: తిరుమల శ్రీవారిని సన్నిధిలో సాధారణ రద్దీ కొనసాగుతుంది. ఇక బుధవారం 76,821 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. మొత్తం 34,732 మంది తల నీలాలు సమర్పించగా, 4.78 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం సమకూరింది. స్వామి వారి సర్వ దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దీంతో సర్వ దర్శనంకు దాదాపు 13 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.
 

బంగారు నవారు మంచంపై...

శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అర్చకులు అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.  శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం  ప్రత్యూష కాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరుస్తారు. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకు ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుగుతుంది.. దీనికే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. అటు తరువాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించిన తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు.

అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు అర్చకులు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఆకాశ గంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాద కవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్టుకు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

బెల్లంతో కలిపిన నువ్వుల పండి నివేదన..

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. 

శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నానికి రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు. అటు తరువాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. 

సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఒంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు.. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget