Tirumala : తిరుమల క్యూలైన్లలో తమిళ ఆకతాయిల ప్రాంక్ వీడియోలు - వార్నింగ్ ఇచ్చిన టీటీడీ
TTD : తిరుమల క్యూలైన్లలో ప్రాంక్ వీడియోలు తీసిన కొంత మంది తమిళ యువకులు వైరల్ చేశారు. దీనిపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
irumala prank Video Row : అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరైల్ చేస్తున్నారు తమిళనాడుకు చెందిన యువకులు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు.
@APPOLICE100 Few youtube vloggers from Tamilnadu has entered into @TTDevasthanams Pilgrims Q-lines with cameras & shooting videos which is highly restricted. Could you please take action on them #Tirumala pic.twitter.com/D4DcB88mTk
— Ârjunaఉవాచ🏹 (@RebelliousFront) July 11, 2024
ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా ప్రాంక్ వీడియోలు తీశారు. నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియో ని రూపొందించగా, కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది.
This is disturbing! Shouldn't encourage such acts of YouTuber #TTFVasan & #Ajeez in #Tirumala Hon'ble CM of AP @ncbn Garu &
— Gokul jothi (@IamPrinceGokul) July 11, 2024
DeputyCM @PawanKalyan Garu &@naralokesh Garu to take necessary action against @TTFvasan_ & his friends. @AndhraPradeshCM @TTDevasthanams @APPOLICE100 https://t.co/rIOIjKlzDG
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో, వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.
క్యూ లైన్లలోకి వచ్చే దగ్గర నుంచి దర్శనానికి వెళ్లే వరకూ పలు రకాలుగా చెక్ చేసి ఫోన్లు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. అయితే.. వారు ఎలా ఫోన్లు తీసుకెళ్లగరిగారన్నది తెలియాల్సి ఉంది. గతంలో ఓ సారి ఆలయం లోపల కూడా వీడియో తీసిన వ్యవహారం సంచలనం అయింది.