Tirumala Ananta Veedhi: అలనాటి తిరుమల ముఖ ద్వారం అనంతవీధి గురించి తెలుసా? దీనికి ఎంతో ప్రాముఖ్యం

కలియుగంలో సాక్షాత్తు శ్రీనివాసుడే వైకుంఠమును వదిలి భూలోకంలోని ఏడుకొండల్లో కొలువైయ్యాడు. శ్రీవారు స్వయం వ్యక్తమై వెలసిన క్షేత్రం కాబట్టే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది.

FOLLOW US: 

కోనేటి రాయుడు పాదాల చెంత తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో చారిత్రాత్మక కట్టడాల గుర్తులు మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.. తిరుపతి పట్టణంలోని ఒక్కో ప్రాంతం ఒక్కో చరిత్ర కలిగి ఉంది అనడంలో ఎటువంటి సందేహం‌ లేదు.. నేటికి ఇక్కడి ప్రజలు పూరాతన సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ప్రాచీన కాలం నాటి సంప్రదాయానికి అద్దం పడుతోంది అనంత వీధి. అనంత వీధికి తిరుమలకు ఉన్న సంబంధం ఏమిటి...?? ఆ వీధి యొక్క స్వాగత తోరణాలు ఏం చెప్తున్నాయి...???

దుష్ట శిక్షణ....శిష్ట రక్షణార్థం కలియుగంలో సాక్షాత్తు శ్రీనివాసుడే వైకుంఠమును వదిలి భూలోకంలోని ఏడుకొండల్లో కొలువైయ్యాడు. శ్రీవారు స్వయం వ్యక్తమై వెలసిన క్షేత్రం కాబట్టే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. శ్రీవారిని శ్రీనివాసుడుగా, తిరుమలేశుడుగా, ఆపదమొక్కులవాడుగా, సప్తగిరీశుడిగా, గోవిందుడుగా ఇలా అనంతమైన పేర్లతో భక్తులు స్వామి వారిని కొలుస్తారు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం కావడంతో తిరుమలేశుని కోవెల నిత్యం వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో మారు మ్రోగుతుంటుంది.. ధనిక,పేద అనే‌ తేడా లేకుండా నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులు అవుతుంటారు.. ఇప్పుడైతే కార్లు., జీపులు బస్సులు ఇలా ఎన్నో రవాణా సౌకర్యంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలనాటి కాలంలో గోవిందుడి దర్శనం కోసం భక్తులు ఎన్నో వ్యయ ప్రాయాసలు కూర్చి.. సుదూర అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకునే వారు. 

వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తులు తిరుపతికి చేరుకోగానే ముందుగా చిన్నబజారు మీదుగా పరసాలవీధికి చేరుకునే‌వారు. అలా చేరుకున్న భక్తులు అనంతావీధికి మీదుగా అలిపిరి చేరుకుని అక్కడి నుండి కాలినడక మార్గం గుండా కొండకు బయలుదేరేవారు. 1985 వరకు అనంతవీధి మార్గం గుండానే భక్తులు తిరుమలకు వెళ్లే సంప్రదాయం కొనసాగుతూ వచ్చేది.. అనంతవీధి తిరుపతికి పొలిమేరగా పిలిచేవారు.. అనంతవీధిలో ఉన్న ద్వారంకు తలుపులు తెరవగానే ఆ ద్వారం గుండా స్వామి వారి దర్శనార్థం గోవింద నామస్మరణతో భక్తులు తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఇలా ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ద్వారాలు తెరిచి ఉంచేవారు.. అలనాటి కాలంలో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అటవీ జంతువుల అలికిడి అధికంగా ఉండేది.. దీంతో చీకటి సమయాల్లో ఎవరిని కొండకు అనుమతించేవారు కాదు. అనంతవీధిలో సాయంత్రం ఐదు గంటల కల్లా కాలిబాట ముఖద్వారాన్ని అక్కడ ఉన్న టిటిడి సిబ్బంది మూసేసే వారు. దీంతో తిరుపతికి వచ్చిన భక్తులు వేరొక మార్గము లేక అనంతవీధికి ప్రక్కనే ఉన్న పరసాల వీధిలో బస చేసేవారు.. అప్పట్లో ఈ పరసాల వీధిలో పూటకూళ్ళ ఇండ్లు ఉండేది.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు ఈ పూటకూళ్ళ ఇండ్లల్లో భోజనం చేసి రాత్రి అక్కడే బస చేసేవారు.. 

అటు తర్వాత ఉదయం ఏడు గంటలకు టీటీడీకి చెందిన సిబ్బంది ఈ ద్వారం తెరవగానే భక్తులు తిరుమలకు ప్రయాణం కొనసాగించేవారు.. ముందుగా అనంతవీధిలో తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన సిబ్బంది ఓ పుస్తకంలో యాత్రికులు తీసుకొచ్చిన విలువైన వస్తువులను వారు లిఖితపూర్వకంగా ఓ పుస్తకంలో వ్రాసుకుని ఆ వస్తువులను అనంతవీధిలో ఓ ఇంటిలో భద్రపరిచేవారు.. స్వామి వారి దర్శనం ముగించుకుని తిరుమల కొండ నుంచి అనంతవీధికి చేరుకున్న భక్తులకు వారి వారి విలువైన వస్తువులను అక్కడి టిటిడి సిబ్బంది తిరిగి అప్పగించే వారు.. అంతేకాకుండా శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాల్లో అలంకరించే గొడుగులు కూడా నేరుగా చెన్నై నుండి అనంత వీధికి చేరుకునేది.. ఇలా చేరుకున్న గొడుగులకు అక్కడి స్థానికులు ప్రత్యేక పూజలు చేసేవారు.. గొడుగులను సాంప్రదాయబద్ధంగా ఒకరాత్రి ఉంచిన తరువాత బ్రహ్మోత్సవాలకు ముందు రోజు తిరుమలకు తీసుకెళ్ళే వారు.. 

అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు స్వామి వారి దర్శనం కోసం వచ్చిన యాత్రికులకు అనంత వీధిలో పెద్ద ఎత్తున అక్కడి నివాసితులు అన్నదాన కార్యక్రమంను చేపట్టేవారు.. అయితే కాలక్రమేణా తిరుపతి అభివృద్ధి చెందడంతో తిరుమలకు రవాణా మార్గం ఏర్పడింది.. దీంతో భక్తులు నేరుగా స్వామి వారి దర్శనంకు అలిపిరి వద్దకు చేరుకుని నడక మార్గం, రవాణా మార్గాల గుండా తిరుమలకు వెళ్లేవారు.. దీంతో అనంతవీధి మహాద్వారం మరుగున పడింది.. కానీ నేటికీ కొన్ని ప్రాంతాల యాత్రికులు పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ తిరుపతికి చేరుకోగానే పరసాల వీధి మీదుగా అనంత వీధికి చేరుకుని అనంత వీధి చివరిలో ఉన్న మహా ద్వారంకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వారి పాదయాత్రగా తిరుమలకు కొనసాగించే సంప్రదాయమును నేటికీ పాటిస్తున్నారు.. 

నేటికీ అనంత వీధిలో ఈ మహాద్వారం చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తుంది.. అయితే శ్రీనివాసుడు దగ్గరకు వెళ్లే భక్తులకు అనంత వీధి వాసులు సేవలందించడం ఈ వీధి గుండానే తిరుమలకు వెళ్లే ద్వారం ఉండడం తాము ఎంత చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్లు ఈ ప్రాంత వాసులు అంటున్నారు.. ప్రతి శనివారం నాడు ఇక్కడి నివాసితులు ఈ‌మహా ద్వారంకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. తిరుపతి మున్సిపల్ అధికారులు అనేక సార్లు ఈ మహాద్వారంను తొలగించేందుకు ప్రయత్నించినా అక్కడి స్ధానికులు అందుకు ఒప్పుకోలేదు.. తమ వీధికి తలమానికంగా ఉన్న ఈ మహాద్వారం తమకు శ్రీవారి మహాద్వారంగా భావిస్తున్నట్లు అనంతవీధి వాసులు అంటున్నారు.. ఈ వీధిలో మహాద్వార ప్రవేసం చేసినప్పుడల్లా ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన కలుగుతుందని ఇక్కడి నివాసితుల భావన.

Published at : 30 Jan 2022 08:41 AM (IST) Tags: ttd Tirumala Tirupati Devasthanam Ttd latest news Tirumala Updates tirumala ananta veedhi ananta veedhi

సంబంధిత కథనాలు

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Minister Roja : మంత్రి రోజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోల్ కతా అమ్మాయి

Minister Roja :  మంత్రి రోజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోల్ కతా అమ్మాయి

SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO

SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO

Chandrababu Comments: నాడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు, నేడు ఖాకీల తీరు దారుణం: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Chandrababu Comments: నాడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు, నేడు ఖాకీల తీరు దారుణం: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?