TTD Tickets: జూన్ నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
June Month Tirumala Ticket: జూన్ నెల ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
Tirumala News: జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా (Quota)ను ఇవాళ (గురువారం) ఉదయం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ (June quota) నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. విడుదల చేసిన నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అయిపోయాయి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వారికి కోటా ఫుల్ అని కనిపిస్తోంది.
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. అలాగే... 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల కోసం దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 25న ఉదయం 10గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది టీటీడీ (TTD). 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనుంది. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను.. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను.. మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో చంద్రబాబు ఫ్యామిలీ
తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుంది చంద్రబాబు (chandra Babu) కుటుంబం. లోకేష్ (lokesh) కుమారుడు దేవాన్ష్ (Devansh) పుట్టిన రోజు సందర్భంగా.. నారా కుటుంబం తిరుమలకు చేరుకుని.. ఈ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి (Bhuvaneswary) తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత... రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వాదం అందించారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా.. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో 38 లక్షల విరాళం ఇచ్చారు. అన్నదాన సత్రంలో భక్తులకు అల్పాహారం వడ్డించారు భువనేశ్వరి, బ్రాహ్మణి. నిజం గెలవాలి యాత్రలో ఉన్న భువనేశ్వరి... గత రాత్రే తిరుమలకు చేరుకున్నారు. అలాగే లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ నిన్న సాయంత్రం తిరుమల వచ్చారు. ఈరోజు ఉదయం నారా కుటుంబ సభ్యులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.