News
News
వీడియోలు ఆటలు
X

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 20 గంటల సమయం 

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 22 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి‌ ఉండగా.. సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతోంది.

FOLLOW US: 
Share:

Tirumala News: వారంతరం కావడంతో తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం రోజున 58,955 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 25,113 మంది తలనీలాలు సమర్పించగా.. 2.50 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 22 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు ఇరవై గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

నేడు దర్శన టికెట్లు విడుదల..! 

శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అలాగే దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ అందుబాటులోకి రానున్నాయి. భక్తులు ఈ వియాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అలాగే భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్ సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే వేసవి కాలం మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందని అంనా వేస్తున్నామన్నారు. అందుకే వీఐపీ రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరారు. అంతేకాదు శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గిస్తామని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి దర్శనం కల్పిస్తామన్నారు.  

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 24 Mar 2023 09:29 AM (IST) Tags: TTD News TTD hundi income Tirumala News TTD Rush Tiruala Latest Updates

సంబంధిత కథనాలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!

పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!

Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 28 గంటల టైం

Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 28 గంటల టైం

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!