News
News
X

Tirumala News: శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం, చివరిరోజు వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala News: శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం, చివరిరోజు వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

FOLLOW US: 
 

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అర్చకులు. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ‌వారి పుష్కరిణిలోని వరహా స్వామి మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీవారి పుష్క‌రిణిలో ఉద‌యం 9 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. 
చివరి రోజు వేడుకగా బ్రహ్మోత్సవాలు
ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. 
ఉత్సవాలు ఒక యజ్ఞమే
అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది. 
ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. ఈ  చక్రస్నాన మహోత్సవంలో కుటుంబ సమేతంగా మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సతీసమేతంగా టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి,టిటిడి అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంట‌లకు శ్రీ మలయప్ప స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై భక్తులకు దర్శన మిచ్చారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. అశ్వ వాహనంను అధిరోహించిన మలయప్ప స్వామి వారికి తిరుమాఢ వీధిలో భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన బుధవారం ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి పుష్కరిణిలో స్నప‌న‌ తిరుమంజ‌నం,చ‌క్రస్నాన మహోత్సవంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

Published at : 05 Oct 2022 10:57 AM (IST) Tags: Tirumala TTD Tirumala Brahmotsavam Telugu News Tirupati Tirumala News Brahmotsavam 2022

సంబంధిత కథనాలు

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

TTD News: జనవరి రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ‌ ఈవో

TTD News: జనవరి రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ‌ ఈవో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

CM Jagan : సీఎం జగన్ ఔదార్యం, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సాయం!

CM Jagan :  సీఎం జగన్ ఔదార్యం, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సాయం!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.