By: ABP Desam | Updated at : 31 Dec 2022 01:27 PM (IST)
Edited By: nagavarapu
తిరుమల తిరుపతి దేవస్థానం (source: twitter)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లమంది తిరుమలకు వెళ్తుంటారు. శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు, కానుకలు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు. ప్రతిరోజు తిరుమల లోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది.
కరోనాతో తగ్గిన భక్తుల సంఖ్య
అయితే గత రెండేళ్లు కరోనా కారణంగా భక్తులు అంతంతమాత్రంగానే స్వామివారిని దర్శించుకుంటున్నారు. 2020 మార్చి నుంచి ఆలయంలోకి భక్తులకు టీటీడీ అనుమతి నిరాకరించింది. దాదాపు 83 రోజులపాటు శ్రీనివాసుడికి ఏకాంతంగానే సేవలు నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గటంతో పూర్తిస్థాయిలో తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 2022 ఉగాది నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా తొలగించారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామివారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది.
సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,116.25 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను అంచనా వేసింది. తర్వాత దాన్ని రూ. 3,243. 19 కోట్లకు సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనాకన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవి కరోనా రాకముందు పద్దులు. కొవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో వార్షిక బడ్జెట్ ను సవరించి రూ. 2,553 కోట్లకు కుదించారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు.
ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో
2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.. కోవిడ్ తరువాత భారీగా భక్తుల సంఖ్య పెరగడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగ హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు..
ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు.
Om Namo Venkateshaya! pic.twitter.com/lRmaGvfrHf
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 12, 2022
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల, Feb 22 నుండి 28 వరకు - ఇలా బుక్ చేస్కోండి
Tirumala News: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరుడికి ఏ నైవేద్యం సమర్పిస్తారంటే?
జల్లికట్టులో అపశృతి - సరదా కోసం వెళ్తే ప్రాణం పోయింది ! మరో నలుగురికి గాయాలు
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్