News
News
వీడియోలు ఆటలు
X

Tirumala High Alert: తిరుమలలో ఉగ్రవాదుల చొరబాటు! హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు - భక్తులకు ఎస్పీ కీలక సూచనలివే

తిరుమలలో ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకు సమాచారం రావడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఉగ్రవాదులు తిరుపతిలో సంచరిస్తున్నారని మెయిల్ చేశాడు.

FOLLOW US: 
Share:

తిరుమల : కలియుగదైవం కొలువైన తిరుమలలో ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకు సమాచారం రావడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉగ్రవాదులు తిరుపతిలో సంచరిస్తున్నారని పోలీసులకు, టీటీడీకి  మెయిల్ చేశాడు. ఆ వ్యక్తి మెయిల్ తో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీస్ అధికారులు తిరుమల ఆలయంలో ప్రవేశించే అవకాశం ఉందని అనుమానించి.. టీటీడీ భద్రతాధికారులని అప్రమత్తం చేశారు. దాంతో తిరుమలలోభద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

గత కొద్దీ రోజులుగా సులభ కార్మికుల సమ్మె కారణంగా పారిశుధ్య కార్మికుల రూపంలో ఉగ్రవాదులు తిరుమలకీ వచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తిరుమలలోని అన్ని ప్రాంతాలోని సిసి కెమెరా పుటేజీని పోలీసులు, భద్రతా సిబ్బంది పరిశీలించారు. బస్సులు, జన సంచారం, రద్దీ ఉన్న ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని భక్తులకు, స్థానికులకు పోలీసులు సూచించారు. అయితే ఉగ్రవాదుల చొరబాటుని పోలీస్ యంత్రాంగం అధికారికంగా దృవీకరించలేదు. 
తిరుమలలో భక్త సంచారం వుండే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..

తిరుమలలో ఉగ్రవాదుల చొరబాటు ప్రచారంపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు  పోలీసులకు సమాచారం అందినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు మెయిల్ వచ్చిందని తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేశామని, చివరికి అది ఫేక్ మెయిల్ అని తేలినట్లు వెల్లడించారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు. తిరుమలలో భద్రత పటిష్ఠం గా ఉందన్నారు. 

తిరుమలలో కత్తులతో ఓ బ్యాచ్ వీరంగం, వ్యక్తికి తీవ్రగాయాలు 
తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు‌ దూరంలోని హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు చూస్తుండగానే, సినిమాలోని ఘటనని తలపించే విదంగా కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడైన సతీష్ తో సహా ఏడుగురు వ్యక్తులు పద్మనాభం అన్నే వ్యక్తి పై కత్తులతో దాడి చేయగా, వీరి నుంచి తప్పించుకున్నే క్రమంలో పద్మనాభం భయపడి పోలీస్ కాంప్లెక్స్ లోకి పరుగులు తీశాడు.

సతీష్ బ్యాచ్ చేసిన ఈ కత్తి దాడిలో బాధితుడు పద్మనాభం చేతి, వీపుపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకపోక పోవడంతో దాడి చేసిన నిందితులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. దాడి ఘటనని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఒకరిపై కత్తులతో దాడి ఘటన జరగడం తిరుమల భద్రతలోని డోల్లతనాని బట్టబయలు చేసింది. ఈ ఘటనని చూసిన భక్తులు ఎప్పుడు, ఎక్కడ నుంచి ఎవరైనా దాడి చేస్తే రక్షణ ఉంటుందా లేదా అని తిరుమలలో హాట్ టాపిక్ అవుతోంది. 

Published at : 01 May 2023 11:32 PM (IST) Tags: TTD Tirumala Tirupati Tirupati SP Terrorists In Tirumala

సంబంధిత కథనాలు

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష

Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష

Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు

Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్