SouthWest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ముందుగానే ఎంట్రీ
SouthWest Monsoon enters Andhra Pradesh | నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. సోమవారం నాడు రాయలసీమను రుతుపవనాలు తాకాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతి: తెలుగు ప్రజలకు శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి. సోమవారం నాడు రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత ఏడాది 2024లో జూన్ 2న రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయని తెలిసిందే. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయి. దీని ప్రభావంతో ఏపీలో రెండు, మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం(26-5-2025) ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 26, 2025
మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలం
2024లో జూన్ 2న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు
~ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ#southwestmonsoon #RainySeason #Monsoon #Monsoon2025 pic.twitter.com/db5PBf7l3w
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్ నగరంతో సహా మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
WELCOME MONSOON TO TELANGANA
— Telangana Weatherman (@balaji25_t) May 26, 2025
The South-west monsoon has advanced into South Telangana region like Gadwal, Mahabubnagar, Nagarkurnool, Nalgonda with excellent rains recorded yesterday 🌧️
Monsoon will further advance into Central Telangana including Hyderabad City next 24hrs 😍…
ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్
తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30-40 కి. మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.






















