![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Purandeshwari Questions: కేంద్రం సహకారాన్ని ప్రజలకు చెప్పడం లేదు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి పురందేశ్వరి ప్రశ్న
Purandeshwari Questions: రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్రమోడీ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు పురేందేశ్వరి. కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
![Purandeshwari Questions: కేంద్రం సహకారాన్ని ప్రజలకు చెప్పడం లేదు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి పురందేశ్వరి ప్రశ్న Purandeshwari Question to AP State Govt Why not telling people about central cooperation Purandeshwari Questions: కేంద్రం సహకారాన్ని ప్రజలకు చెప్పడం లేదు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి పురందేశ్వరి ప్రశ్న](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/98bbb74a7532934757d8d9a9978252221698818469946215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్రమోడీ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు పురేందేశ్వరి. కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అందుకే తామే ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమం చేపట్టామన్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. వాటి వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు.
కేంద్రం తరఫున చేపట్టే ప్రాజెక్టులను సందర్శించి వాటి వివరాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ను పురందేశ్వరి సందర్శించారు. అక్కడ జరిగే వివరాలపై మాట్లాడారు. 1700 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని వివరించారు. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం 311కోట్ల రూపాయలతో జరుగుతోందని పేర్కొన్నారు.
Visited Tirupati and inspected the development programs at the railway station. pic.twitter.com/feC0Xtr1XU
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) November 1, 2023
ఈ రెండు పనులతోపాటు ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు 600 నుంచి 800కోట్ల రూపాయలను అందించింది కేంద్రమని తెలిపారు పురందేశ్వరి. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు 1695కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. తిరుపతిలో 21వేల తాగునీటి కనెక్షన్లు, 16వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించిందని వివరించారు.
అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం మోడీ చేస్తున్నారని అభినందించారు పురేందేశ్వరి. అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనే భారతదేశం అభివృద్ధిలో మూడవ స్థానంలోకి రాగలదని అభిప్రాయపడ్డారు. అదే టైంలో ఆ రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టే పనులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
తిరుపతి లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP గారి కి ఘనస్వాగతం పలికిన బిజెపి నేతలు#APNeedsBJP #Chinnamma4Andhra pic.twitter.com/DFrpIOAXVg
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) October 31, 2023
పురాతన మండపాలను టిటిడి కూల్చివేయడం సరైన పద్ధతి కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. తిరుపతి పర్యటనలో భాగంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలను ఆమె సందర్శించారు. అంతక ముందు అలిపిరి పాదాల మండపం వద్ద గల పురాతన మండపాలను ఆమె పరిశీలించారు. అనంతరం గోశాలలో గోపూజ నిర్వహించి గోవులకు ఆహారంగా దానా తినిపించారు.. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా జిల్లాల పర్యటనను శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రారంభించడం స్వామి వారి అనుగ్రహంగా, తన అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి చెప్పారు.
తిరుపతిలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామన్నారు పురందేశ్వరి. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న పురాతన మండపాన్ని పునరుద్ధరణ పేరుతో వాటిని తొలగించే వియోచనలో ఉన్నట్టు టీటీడీ ఉందని, వంద సంవత్సరాలు పైబడిన కట్టడాలను తొలగించకూడదని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఏఎస్ఐ సవరణ చేస్తూ దాదాపు 75 సంవత్సరాల పైబడిన కట్టడాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతితో పర్యవేక్షణలో మాత్రమే కూల్చివేయాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న పురాతన మండపం దాదాపు 500 సంవత్సరాల పైబడిందని కనుక టీటీడీ పునరుద్ధరణ పనులు చేపట్టాలన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో జరగాలని బిజెపి డిమాండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు..
తిరుమలలోని పార్వేటి మండపంను పునరుద్ధరణ పేరుతో పూర్తిగా తొలగించి ఇష్టానుసారం పార్వేటి మండపంలో నిర్మించడం సరైనది కాదని ఇలాంటి ఘటనపై బిజెపి పోరాటంకు సిద్ధంగా ఉంటుందని అన్నారు పురందేశ్వరి. శ్రీవారి భక్తులు సమర్పించేటువంటి కానుకలతో హిందూ ధర్మ పరిరక్షణకు గాని, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని, భక్తుల సమర్పించిన నగదులో ఒక్క శాతం తిరుపతి నగరం మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనపై పోరాటం చేస్తే వైసిపి ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. అనేక టాక్స్ ల ద్వారా ప్రభుత్వంకు నగదు అందుతుందని, ఆ నగదుతోని తిరుపతి అభివృద్ధిని ప్రభుత్వం చేయాలని ఆమె చెప్పారు.. దోపిడీ వైఖరిగా స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుపతి అభివృద్ధికి ఒక శాతం తీసుకోవడం మంచిది బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ తప్పుబట్టారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)