By: ABP Desam | Updated at : 27 Jan 2023 10:30 AM (IST)
కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్ర ప్రారంభంకాక ముందే కుప్పంలో రాజకీయకాక రాచుకుంది. ఫ్లెక్సీలు చించివేతపై కొత్త వివాదానికి తెర తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పని ఇప్పుడు కుప్పంలో రగడకు కారణమైంది.
నారా లోకేష్ యాత్ర సందర్భంగా కుప్పం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రి వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. మరికొన్నింటికి నిప్పు పెట్టారు.
కుప్పంలో చెరువు కట్ట మీద ఉన్న కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు వేసిన బ్యానర్లు చించేశారు. మరికొన్నింటికి నిప్పు పెట్టారు. దీనిపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. చేసిందెవరో తెలుసని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోరని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. టైం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెప్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
మరోవైపు యువగళం పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగాయి. కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్రకు బయల్దేరనున్న లోకేష్.. మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు దేవాలయం నుంచి పాదయాత్ర మొదటి అడుగు పడుతుంది. పాతమసీదు, బస్టాండు, కుప్పం రోడ్డు మీదుగా సాయంత్రం 4 గంటలకు పార్టీ ఆఫీస్ చేరుకోనున్నారు. టిడిపి కార్యాలయంలో ముప్పై నిమిషాల పాటు విరామం తీసుకుంటారు. టిడిపి కార్యాలయం వద్ద సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. 5:50 నిమిషాలకు ఐస్ ల్యాండ్ జంక్షన్, ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లి, బెగ్గిలిపల్లె, మీదుగా పిఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకోనున్నారు.
రాత్రి 8 గంటలకు పిఈఎస్ మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేస్తారు నారా లోకేష్. మొదటి రోజు 8.4 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు నారా లోకేష్. రేపు ఉదయం 8 గంటలకు పిఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
యువగళం పాదయాత్ర షెడ్యూల్
పాదయాత్ర మొదటిరోజు షెడ్యూల్
10-30 AM – కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు
11.03 AM – పూజ అనంతరం గుడి ఆవరణ నుంచి పాదయాత్రకు శ్రీకారం
11.30 AM – సమీపంలోని మసీదులో ప్రార్థనలు
11.55 AM – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు
12.45 PM – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు
1.05 PM – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
1.25 PM – కొత్త బస్ స్టేషన్ వద్ద పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు
3.00 PM – హెచ్ పీ పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ
4.30 PM – ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపంలోని క్యాంప్ సెట్ కు చేరుకుంటారు.
6.45 PM – పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలోని క్యాంప్ సైట్ కు చేరుకుని, విరామం
28-1-23 (శనివారం) – 2వరోజు
8.00 AM – కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభం
9.15 AM – బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ
11.05 AM – కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
1.30 PM – కలమలదొడ్డిలో భోజన విరామం – పార్టీ సీనియర్ నేతలతో సమావేశం
3.30 PM – కలమలదొడ్డినుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక – ప్రముఖులతో సమావేశం
6.45 PM – 2వరోజు పాదయాత్రకు విరామం – శాంతిపురంలో బస
29-1-2023 – 3వరోజు
8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం
8.45 AM – ప్రముఖులతో సమావేశం
9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ
12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం
3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక. ప్రముఖులతో సమావేశం
5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!