నేటి నుంచే లోకేష్ పాదయాత్ర- జనం మధ్యకు యువగళం
తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తరుణం రానే వచ్చింది. లోకేష్ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నాలుగు వందల రోజుల పాటు యాత్ర చేపట్టడానికి లోకేష్ రెడీ అయ్యారు.
యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టే యాత్ర ఇవాళ ప్రారంభంకానుంది. కుప్పం నుంచి ఈ యాత్ర స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు. తన ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా భావించే లక్ష్మీపురం వరదరాజ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు లోకేష్. మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్, ఎన్టీఆర్, సుభాష్ చంద్రబోష్, గాంధీజీ విగ్రహాలకు పూల మాల వేసి యాత్రను ప్రారంభిస్తారు.
తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తరుణం రానే వచ్చింది. లోకేష్ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నాలుగు వందల రోజుల పాటు యాత్ర చేపట్టడానికి లోకేష్ రెడీ అయ్యారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. దీని కోసం టీడీపీ శ్రేణులు భారీగా సన్నద్ధమవుతున్నారు. కుప్పం పసుపురంగు పులుముకుంది.
ఇవాళ్టి పాదయాత్రలో కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి బయల్దేరనున్న లోకేష్ కమతమూరు గ్రామమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వరకు పాదయాత్రగా వెళతారు. అక్కడ మాట్లాడిన తర్వాత కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీ వరకు వెళ్లి అక్కడే రాత్రికి బస చేస్తారు. రెండో రోజు పాదయాత్ర మళ్లీ అక్కడి నుంచే మొదలవుతుంది.
పాదయాత్రకు ఒకరోజు ముందే నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. లోకేష్ కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేసిన లోకేష్ ఈ ఉదయం వరదరాజుల ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం 4 వేల కిలోమీటర్ల పాదయాత్రను 11.03 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం సభ నిర్వహించనున్నారు. ఈ సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి లోకేశ్ చేరుకోనున్నారు. పాదయాత్రలో మొదటి రోజు 8.5 కిలోమీటర్ల దూరం లోకేశ్ నడవనున్నారు.
ఉదయం 11.03 పాదయాత్ర ప్రారంభం
కుప్పంలో లోకేశ్ యువగళం పాదయాత్రకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువగళం బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు రామానాయుడు, కళా వెంకట్రావు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర నేతలు హాజరుకానున్నారు. యువగళం యాత్రకు సంఘీభావంగా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
యువగళం పాదయాత్ర షెడ్యూల్
పాదయాత్ర మొదటిరోజు షెడ్యూల్
10-30 AM – కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు
11.03 AM – పూజ అనంతరం గుడి ఆవరణ నుంచి పాదయాత్రకు శ్రీకారం
11.30 AM – సమీపంలోని మసీదులో ప్రార్థనలు
11.55 AM – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు
12.45 PM – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు
1.05 PM – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
1.25 PM – కొత్త బస్ స్టేషన్ వద్ద పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు
3.00 PM – హెచ్ పీ పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ
4.30 PM – ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపంలోని క్యాంప్ సెట్ కు చేరుకుంటారు.
6.45 PM – పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలోని క్యాంప్ సైట్ కు చేరుకుని, విరామం
28-1-23 (శనివారం) – 2వరోజు
8.00 AM – కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభం
9.15 AM – బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ
11.05 AM – కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
1.30 PM – కలమలదొడ్డిలో భోజన విరామం – పార్టీ సీనియర్ నేతలతో సమావేశం
3.30 PM – కలమలదొడ్డినుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక – ప్రముఖులతో సమావేశం
6.45 PM – 2వరోజు పాదయాత్రకు విరామం – శాంతిపురంలో బస
29-1-2023 – 3వరోజు
8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం
8.45 AM – ప్రముఖులతో సమావేశం
9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ
12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం
3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక. ప్రముఖులతో సమావేశం
5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస