MLA Kethireddy: నీ పథకాలేం అక్కర్లేదన్న గ్రామస్థుడు, క్షణాల్లోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పర్యటించారు.
గడపగడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్తున్న ప్రజా నిధులకు అక్కడక్కడా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎన్నో వైరల్ అవుతున్నాయి. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఎప్పటిలాగే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో శనివారం ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది.
కొండన్న గారి శివయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే కేతిరెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను చూసి.. ‘‘మేం వస్తున్నామని జెండాలు కట్నారా..ఏమి’’ అని కేతిరెడ్డి సరదాగా అన్నారు. అలా కొండన్న గారి శివయ్య కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా లభించిన లబ్ధి వివరాల బ్రోచర్ ను ఎమ్మెల్యేకు ఇవ్వబోయారు. అయితే ‘నీ పథకాలు అవసరం లేదు’ అంటూ శివయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ముఖంపైనే తిరస్కరించారు. దీంతో కేతిరెడ్డి తీసుకోమని మరోసారి కోరారు. అయినా వారు వినకపోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు.
వారికి పథకాలు పీకేసిన ఎమ్మెల్యే?
అలా వెళ్తూ అక్కడే గ్రామ వాలంటీర్ మమతను పిలిచి.. ‘‘ఏమ్మా వారికి పథకాలు ఏమీ వద్దంటా.. వాళ్లు అంత ఇబ్బంది పడుతుండగా బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? తీసేయండి. వాళ్ల బదులు మరెవరికైనా సాయం చేయవచ్చు కదా? అని అన్నారు. ఇంతలో ఆ కుటుంబంలో వ్యక్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా.. ‘పథకాలు వద్దన్నారుగా.. తీసేస్తాంలే’ అని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలను తీసేయించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది.
విజయసాయి రెడ్డి - అయ్యన్నపాత్రుడు కౌంటర్లు
ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయం రెడ్డి ట్వీట్ చేయగా, అందుకు కౌంటర్ గా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. తమకు సంక్షేమ పథకాలే వద్దని ఆ కుటుంబంలోని వారు తెగేసి చెప్పగా.. ఇప్పటిదాకా వారు పొందిన లబ్ధి వివరాలను ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ మదన్ మోహన్ రెడ్డికి, జగన్ వదిన వైఎస్ మాధవీలతకు టీడీపీ హయాంలో రైతు రుణమాఫీ అయ్యిందని చింతకాయల అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. వైఎస్ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా రూ.63 వేలు, 3వ కంతుగా (విడత) రూ.36 వేలు జమ అయ్యాయని తెలిపారు. అలాగే వైఎస్ మాధవీలత అకౌంట్ నెంబర్ 045213100036613 లో రెండు కంతులుగా రూ.59,643, మూడో కంతుగా రూ.34,081 వైసీపీ ఎమ్మెల్యేకు కూడా రుణమాఫీ అయ్యింది. మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. మా హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని మ్యాచ్ చేయడం మీతరం కాదు విజయసాయ రెడ్డి అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
వై.యస్ మదన్మోహన్ రెడ్డి గారికి,
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 2, 2022
జగన్ వదిన అయిన శ్రీమతి వై.యస్ మాదవీ లత గారికి టిడిపి హయాంలో రైతు రుణ మాఫీ అయ్యింది సాయి రెడ్డి.
వై.యస్ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా 63 వేలు,3 వ కంతుగా 36 వేలు
వై.యస్ మాధవి లత అకౌంట్ no. 045213100036613 లో రెండు కంతులుగా ,1/2 pic.twitter.com/H1obPZ6t5K