మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు
Madanapalle Sub Collector Office fire incident | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించి కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఐ వలిబసును వీఆర్‌కు పంపారు.
![మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు Madanapalle 1town CI sends to VR in Madanapalle Sub Collector Office fire incident మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/24/ab985d4df46402b8516b880028841c231721839181046233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madanapalle Sub Collector Office | మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతోంది. మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని గుర్తించిన అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. దాంతో సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ బుధవారం నాడు (జులై 24) ఆదేశాలు జారీ చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐ సరిగా విధులు నిర్వహించలేదని గుర్తించిన అధికారులు సీఐ వలిబసుపై చర్యలు తీసుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై ప్రభుత్వం ఆదేశాలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పీవీ వెంకటరమణ, అధికారి అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణలో డైరెక్టర్‌తో పాటు మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప కూడా పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అగ్నిప్రమాదం జరిగిన తీరు, విధానాలు సహా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)