అన్వేషించండి

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు

Tirumala News | కళియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. మెట్టు మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Leopard spotted in Tirumala | తిరుమల: అసలే చిరుత సంచారంతో కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు కొన్నిరోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుమల క్షేత్రంలోనూ పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మళ్లీ చిరుతను సంచరించడం కొందరు భక్తులు గమనించారు. ఈ విషయంపై టీటీడీ భద్రతా సిబ్బందికి కొందరు భక్తులు సమాచారం అందించారు.   

తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు రాత్రివేళ వచ్చిన చిరుత కుక్కలను తరిమింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని సమాచారం. సెక్యూరిటీ గార్డు సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు చిరుత సమచారంపై సమాచారం ఇచ్చారు. వన్య మృగాల‌ కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి టీటీడీ అటవీ శాఖ చర్యలు చేపట్టింది. 

గతంలోనూ చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు అలర్ట్

తిరుమలలో మరో‌సారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గతంలో అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో కొన్ని చిరుతపులను అటవీశాఖ అధికారులు బంధించడం తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్తున్న ఓ బాలుడిపై దాడి చేశాయి. ఓ సందర్భంలో అయితే చిన్నారిని లాక్కెళ్లి దాడిచేయగా చనిపోవడం భక్తులకు ఆందోళనకు గురిచేసింది. దాంతో తిరుమలలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. భక్తులకు మనోధైర్యం కోసం కర్రలను సైతం టీటీడీ ఇచ్చింది. కొన్ని వేళల్లో తిరుమలలో చిన్నారుల ప్రవేశంపై సైతం కొత్త రూల్స్ తీసుకొచ్చారు. 

శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి కాలిబాట, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం భక్తులతో పాటు టీటీడీని కలవర పెడుతోంది. ముఖ్యంగా కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుతల సంచారం ఎక్కువగా గుర్తించారు. కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడి పోయారు.‌ గతంలో చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లలను నడక మార్గంలో అనుమతించేలా చర్యలు చేపట్టారు.  ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించి భక్తులకు జాగ్రత్తలు చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget