ISRO PSLV-C61 Mission: ఇస్రో ప్రయోగం విఫలం, పీఎస్‌ఎల్‌వీ సీ61లో టెక్నికల్ ప్రాబ్లమ్: చైర్మన్ నారాయణన్
Indian Space Research Organisation (ISRO) 101వ మిషన్ పీఎస్‌ఎల్‌వీ-C61 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో EOS-09 ఉపగ్రహం (రీశాట్ 1బీ కక్ష్యలోకి చేరలేదు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన తాజా ప్రయోగం సక్సెస్ కాలేదు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 5:59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-09 (రీశాట్ 1బీ)ను ఇస్రో ప్రయోగించింది. ఇది ఇస్రోకు 101వ ఉపగ్రహ ప్రయోగం. కాగా, మొదటి రెండు దశలు పూర్తి చేసుకుని నింగిలోకి దూసుకెళ్తుండగా మూడో దశలో సమస్య తలెత్తింది. పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విజయవంతం కాలేదని, సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడో దశలో పీఎస్‌ఎల్వీ సీ61 రాకెట్ లో సమస్య తలెత్తమే కారణమని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
మూడో దశలో సాంకేతిక సమస్య
ఇస్రో చేసిన 101వ ఉపగ్రహ ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సి61. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-09 (రీశాట్ 1బీ)ని కక్ష్య (ఎస్‌ఎస్‌పిఒ)లో ప్రవేశపెట్టాలని చేసిన ప్రయోగంలో సంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ అన్నారు, ‘మనం పీఎస్‌ఎల్‌వీ-సి61 రాకెట్ ప్రయోగించడానికి ప్రయత్నించాం. ఇది మొత్తం 4-దశల వాహనం. మొదటి 2 దశలు ఊహించిన విధంగానే పూర్తయ్యాయి. 3వ దశలో అనుకోని సమస్య తలెత్తడంతో మిషన్ పూర్తి చేయలేకపోయాం. అధ్యయనం చేసి అసలేం జరిగిందో త్వరలోనే తెలియజేస్తామన్నారు.
Today 101st launch was attempted, PSLV-C61 performance was normal till 2nd stage. Due to an observation in 3rd stage, the mission could not be accomplished.
— ISRO (@isro) May 18, 2025
ఈ మిషన్ ద్వారా ప్రయోజనాలు ఇవే
పీఎస్‌ఎల్‌వీ-సి61 మిషన్‌లో ఇది 63వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగించి చేసిన 27వది. ఇది మెరుగైన థ్రస్ట్, పెద్ద పేలోడ్ సామర్థ్యం కలిగిన వెర్షన్. ఏఎన్‌ఐ ప్రకారం.. ఈ పీఎస్‌ఎల్‌వీ సీ61 మిషన్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూ పరిశీలనలో భారతదేశం నైపుణ్యం, ముఖ్యంగా జాతీయ భద్రత, విపత్తు నిర్వహణకు చాలా ముఖ్యమైనదని తెలిపింది.
🚀 LIFTOFF!
— ISRO (@isro) May 18, 2025
ISRO’s 101st launch mission takes flight aboard PSLV-C61
📺 Watch Live Streamhttps://t.co/JTNzdc1own
More information: https://t.co/cIrVUJxKJx#ISRO #ISRO101
పీఎస్‌ఎల్‌వీ సీ61లో ప్రయోగించిన రీశాట్-1 ఉపగ్రహం తరువాత భాగం అయిన ఈఓఎస్-09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని లైఫ్‌టైం 5 సంవత్సరాలు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల ఫొటోలను అధిక రిజల్యూషన్‌తో తీసి ఇస్త్రో శాస్త్రవేత్తలకు చేరవేయనుంది. ప్రస్తుత కాలంలో అవసరమైన రియల్ టైం కవరేజీ ఉద్దేశంతో ఈఓఎస్-09ను భూ పరిశీలన ఉపగ్రహాలలో చేర్చాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం కార్టోశాట్, రిసోర్స్‌శాట్, రీశాట్-2బి సిరీస్ ఉపగ్రహాల తరహాలోనే డేటా సేకరించి చేరవేస్తుంది. 2022లో ఈఓఎస్-04 ఉపగ్రహం ప్రయోగించగా, ప్రస్తుతం దానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-09 (రీశాట్-1బి)ను పంపాలని ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు శ్రీవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ పూజలు
ఈ ఉపగ్రహం రిసోర్స్‌సాట్, కార్టోసాట్, రిసాట్-2బి సిరీస్‌తో సహా ఇతర భారత ఉపగ్రహాల ద్వారా అందించబడిన డేటా ప్రక్రియను పూర్తి చేయనుంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న రిమోట్ సెన్సింగ్ డేటా ఫ్రీక్వెన్సీ, నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. పీఎస్‌ఎల్‌వీ-సి61 నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. విషన్ సక్సెస్ కావాలని ప్రార్థించారు.






















