అన్వేషించండి

Tirupati Laddu Row: తిరుమల వివాదంలో సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? ఏ అంశాలపై దృష్టి పెట్టింది?

Tirupati News: తిరుమల లడ్డూ వివాదం లో సిట్ బృందం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. అసలు టెండర్లు, కొనుగోలు, ఎవరు బాధ్యులు, ఏమి జరిగింది అనే అంశాలపై దృష్టి పెట్టి విచారణ చేస్తున్నారు.

Tirumala News: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇలాంటి లడ్డూ వివాదంలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించి చేసింది... చేయించింది అనే రెండు విధాలుగా విచారణ జరుగుతోంది. ఇందులో ఎవరు బాధ్యులు అవుతారో వేచి చూడాల్సిందే.

పరమపవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల్లో నెయ్యి కల్తీ వాడినట్టు... అందులో జంతువుల కొవ్వు, చాప నూనె, కూరగాయల నూనె కలగలిసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత పెను దుమారం రేగింది. రోజుకొక కొత్త అంశం బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా ఇదే బర్నింగ్ ఈష్యుగా మారిపోయింది. దీంతో టీటీడీ చెప్పే విషయాలకు వైసీపీ నుంచి ఎదురుదాడి ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

సిట్ పనితీరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐజీ స్థాయి అధికారితో మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న సభ్యులు తిరుమల, తిరుపతిలో గతంలో పని చేసిన వారే అధికంగా ఉన్నారు. సిట్ బృందం ని సభ్యులు సైతం గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారే కావడం ఆసక్తికర విషయం. అయితే సిట్ బృందం మూడు రోజులు పాటు పర్యటించింది.. ఇంకా ఎన్ని రోజులు పాటు కొనసాగుతుందో చెప్పలేము. 
సిట్ బృందం తొలుత సమావేశమై మూడు బృందాలుగా విడిపోయారు. ఇద్దరు ఎస్పీలు, ఐజీ మూడు బృందాలు చేయాల్సిన పని తీరు గురించి చర్చించుకున్నారు. ఎక్కడ నుంచి పని ప్రారంభించాలి.. ఎక్కడ విచారణ చేయాలి... ఏ రికార్డులు పరిశీలిస్తే నిజాలు బయట పడుతాయి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

టీటీడీ పాలకమండలి, అధికారుల పరిస్థితి
టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి అన్ని వివరాలు సిట్ బృందం తీసుకుంది. అసలు నెయ్యి టెండర్లు వేసిన వ్యక్తులు ఎవరు.. ఎంత మేర క్వాలిటీ ఉంది.. ఆ రిపోర్టులు ఉన్నాయా.. చివరి టెండర్లు ఎప్పుడూ జరిగాయి.. ఎంత ధరకు సరఫరా చేస్తామని అన్నారు. తక్కువ ధర అంటే క్వాలిటీ పరిస్థితి ఏంటి అనే విషయలను ఇప్పటికే టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళి కృష్ణ ను సిట్ బృందం అడిగి వివరాలు తెలుసుకుంది.
తక్కువ ధరకు వస్తున్న టీటీడీ గత పాలక మండలి సభ్యులు, పర్చేజింగ్‌ కమిటీ సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదు.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు.. గతంలో వీరు పాత్ర ఏమైనా ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీటీడీ అధికారుల విషయం కూడా చేర్చించినట్లు సమాచారం. క్వాలిటీ లేదని తెలిసి ఎందుకు ప్రశ్నించలేదు.. కనీసం రికార్డులో అయిన దానిని నమోదు చేసారా లేదా.. ఈ విషయాన్ని అప్పటి టీటీడీ ఈవో, ధర్మకర్తల మండలి దృష్టికి తీసుకెళ్ళారా లేదా అనేది కూడా కూపీ లాగుతున్నారు. తిరుమల తిరుపతిలోని లడ్డూ కు సంబంధించిన వివరాలు తీసుకునేందుకు పలు విభాగాలను పరిశీలన చేసే అవకాశం ఉంది.

ఒక్క సంస్థ పైన మాత్రమేనా
తిరుమలకు టెండర్ తీసుకున్న తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు రోజులు వ్యవధిలో రెండు ట్యాంకుల నెయ్యి వచ్చినట్లు గుర్తించారు. అయితే రెండు ట్యాంకులు వేరే వేరే పేర్లు ఉన్నాయి.. అంతేకాకుండా మరో రెండు ట్యాంకులు సైతం అలాగే రావడం.. రెండు సార్లు వచ్చిన ట్యాంకులకు ఒకే నెంబర్ ఉండడాన్నీ టీటీడీ మార్కెటింగ్ శాఖ గుర్తించింది. ఇదే అంశాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆ ట్యాంకులు ఎవరివి.. ఎందుకు ఒకే నెంబర్ తో వచ్చాయి.. నెయ్యి సరఫరాదారులు అంతా సిండికేట్ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా త్వరలో సిట్ బృందం తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సైతం పరిశీలన చేయనుంది. అయితే టీటీడీ తెలిపిన విధంగా అన్ని సంస్థలు క్వాలిటీ లేకుండా సరఫరా చేస్తుంటే వారికి హెచ్చరించామని ఈవో ప్రకటించగా మార్పు చేసుకున్నట్లు తెలిపారు. అయితే మిగిలిన వారిని విడిచిపెట్టనట్టేనా.. వారిది తప్పు ఉందా లేదా అనేది తేల్చాల్సిన పని లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget