By: ABP Desam | Updated at : 01 Apr 2023 02:18 PM (IST)
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరం నెలకొంది. నియోజకవర్గం అభివృద్ధిపై టీడీపీ,వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. టీడీపీ లీడర్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ శ్రీధర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. జిల్లా అభివృద్ధిపై సత్మెమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నువ్వు ఎలాంటోడివో మహిళల మాటల్లో విను Duddukunta Sreedhar Reddy
— Palle Raghunath Reddy (@palleraghu_tdp) April 1, 2023
.#puttaparthigaddatdpadda #palleraghunathareddy #puttaparthi pic.twitter.com/NltYGMM2LZ
ఉదయాన్నే పోలీసుల ఆంక్షలు ఛేదించుకొని శ్రీధర్ రెడ్డి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆయన అనుచరులతో భారీగా అక్కడకు ఆయన వచ్చారు. అదే టైంలో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఆలయం వద్దకు చేరుకునే ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ని టీడీపీ ఆఫీస్‌లోనే నిర్బందించారు. ఆఫీస్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు. లోపల ఉన్న వారిని బయటకు పోనివ్వడం లేదు.
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. #YSRCPRowdyism pic.twitter.com/wGk0FRhwQ5
— N Chandrababu Naidu (@ncbn) April 1, 2023
టీడీపీ ఆఫీస్ వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఒకరి వాహనాలును ఒకరు ధ్వంసం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లు గప్పి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా సత్తెమ్మ దేవాలయానికి చేరుకున్నారు. కారుపైకి ఎక్కి వైసీపీ నేతలకు సవాల్ చేశారు.
పోలీసులు టీడీపీ నేతలను అరెస్టులు చెయ్యడం సహజమే!! కానీ పల్లె రఘునాథ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీస్ జీపునే అడ్డుకోవడమే ప్రజా తిరుగుబాటు అంటే!!#TeamPalle#puttaparthigaddatdpadda #palleraghunathareddy #puttaparthi #ByeByeJaganIn2024 #RIPDemocracyInAP#EmergencyInAP pic.twitter.com/NjDY4oNAYj
— Palle Raghunath Reddy (@palleraghu_tdp) April 1, 2023
దాడిని ఖండించిన చంద్రబాబు
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవన్నారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రమాణం చేసేందుకు ఛాలెంజ్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి... మాజీ మంత్రి తెలుగుదేశం నేత పల్లె రఘునాథ రెడ్డిని ప్రమాణం చేయనీయకుండా అడ్డుకోవడం చేతకానితనం కాదా? pic.twitter.com/7pzujZVBrh
— Telugu Desam Party (@JaiTDP) April 1, 2023
వైసీపీపై మండిపడ్డ టీడీపీ నేతలు
జగన్ అండతో వైసీపీ రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారన్నారు. వైసీపీ రౌడీమూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
జగన్ అండతో వైసీపీ రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారు. వైసీపీ రౌడీమూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడమేంటి? 1/2
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 1, 2023
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!
Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 28 గంటల టైం
GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు
Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!