News
News
వీడియోలు ఆటలు
X

సైకాలజీ చదవలేదు కానీ మంచి సైకియాట్రిస్ట్‌నే- అందుకే చెబుతున్నా ఆయనో సైకో: బాలకృష్ణ

రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే వైఎస్‌ఆర్‌సీపీ ఉందని విమర్శించారు నందమూరి బాలకృష్ణ. ఏపీలో ఉంది ఓ చెత్త ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

జనమంటే జగన్‌కు ప్రేమ లేదని... కక్ష ఒక్కటే ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన బాలకృష్ణ... హిందూపురంలోని గార్లదిన్నెలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్, వైసీపీ పాలనపై డైలాగులు పేల్చారు. 

రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే వైఎస్‌ఆర్‌సీపీ ఉందని విమర్శించారు నందమూరి బాలకృష్ణ. ఏపీలో ఉంది ఓ చెత్త ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా తాత్సారం చేశారన్నారు. ఇన్నేళ్లు వాటిని మెంటెయినెన్స్‌ లేకపోవడంతో అవి పాడైపోయే స్థితికి చేరుకున్నాయన్నారు. వాటిని ఇప్పుడు ఇచ్చినా తీసుకోవదని బాలకృష్ణ సూచించారు. అవి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయని.. తీసుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతాయన్నారు. 

అసలు ప్రజలంటే జగన్‌కు ఎలాంటి ప్రేమ లేదని... ఆయన స్వీట్‌గా మాట్లాడుతూంటే  ప్రేమ అనుకోవద్దన్నారు బాలయ్య. జనాలపై జగన్‌కు ఉన్నది కక్ష మాత్రమే అన్నారు. అదో సైకోతత్వం అని హాట్ కామెంట్స్ చేశారు. తాను సైకాలజీ చదవిలేదని కానీ తనకు మించిన సైకియాట్రిస్ట్ లేడని అభిప్రాయపడ్డారు. ఎవరి నుంచీ సలహాలు తీసుకోవడం ఈ ప్రభుత్వానికి అసలు నచ్చదన్నారు బాలకృష్ణ. ప్రభుత్వంలో ఉన్న సలహాదారులంతా ఓ వర్గానికి చెందిన వారేనని... వారి సలహాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందేనన్నారు. 

మీడియా సమావేశం అనంతరం లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేపట్టారు బాలకృష్ణ. గంజాయి వద్దు బ్రో అనే స్లోగన్‌తో టోపీలు ధరించి పాదయాత్ర చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు 

Published at : 07 Apr 2023 10:53 AM (IST) Tags: YSRCP Balakrishna HINDUPURAM MLA TDP MLA Jagan Lokesh Yuva Galam

సంబంధిత కథనాలు

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!

పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!