Kota Vinoota: పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం - కోట వినూత సంచలన వీడియో
Kota Vinutha : శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినూత వీడియో విడుదల చేశారు. హత్య కేసులో అన్యాయంగా ఇరికించారని ..నిర్దోషులుగా బయటకు వస్తామన్నారు.

Kota Vinutha video: రాయుడు అనే డ్రైవర్ ను హత్య చేసిన కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఇంచార్జ్ కోట వినూత ఓ వీడియో విడుదల చేశారు. తెలుగింటి అడ బిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పని చేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానని తెలిపారు. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నానని చెప్పారు. లక్షల జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చామన్నారు. మేము ప్రస్తుతం చెన్నై లో ఉన్నాము ,త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు. జైలుకు వెళ్లామన్న బాధ లేదుకానీ.. తామే చంపామని ప్రచారం చేయడం మాత్రం ఆవేదన కలిగిస్తోందన్నారు. నెల రోజుల్లోపే తాము అందరికీ బెయిల్ వచ్చిందని.. తము హత్య చేశామన్నదానికి ఆధారాలు లేవన్నారు.
నేను మీ వినుత కోటా, తెలుగింటి అడ బిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పని చేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను.
— Vinutha Kotaa (@VinuthaKotaa) October 13, 2025
- మేము ప్రస్తుతం చెన్నై లో ఉన్నాము… pic.twitter.com/QApig3RuFU
డ్రైవర్ హత్య కేసులో బెయిల్ పై విడుదలైన నిందితులు
వినుత కోటా డ్రైవర్ సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో వినూత, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు అరెస్టయ్యారు. అయితే, వినుత ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి దీని వెనుక ఉన్నారని ఆరోపిస్తున్నారు.
వినుతకోటా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి జనసేనా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె డ్రైవర్ రాయుడు చాలా కాలంగా ఆమెతో పని చేస్తున్నాడు. జూన్ 21న వినుత, చంద్రబాబు ఒక ప్రకటనలో రాయుడు తమతో ఎలాంటి సంబంధం లేదని, అతడు రాజకీయ ప్రత్యర్థుల ఉచ్చులో పడి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నాడని పేర్కొన్నారు. తర్వాత చెన్నై శివారులో హత్యకు గురయ్యాడు. చెన్నై పోలీసులు ఆధారాలు సేకరించి వినూత కోట దంపతులతో పాటు వారి అనుచరుల్ని అరెస్టు చేశారు. జులైలో జరిగిన ఈ హత్యలో రాయుడును శ్రీకాళహస్తిలో ఒక ఫ్యాక్టరీ సమీపంలో తీవ్రంగా హింసించి, గొంతు నులిమి చంపారు. అనంతరం మృతదేహాన్ని చెన్నై సమీపంలోని కూవం నదిలో పడేశారు. . చెన్నై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి, శనివారం వినుత, చంద్రబాబు, వారి ముగ్గురు సన్నిహితులు గోపి, శివకుమార్, షేక్ తాసన్‌లను అరెస్టు చేశారు. అరెస్టయిన వారంతా నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
కలకలం రేపుతున్న చనిపోక ముందు డ్రైవర్ రాయుడు వీడియో
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారని చెబుతున్న డ్రైవర్ రాయుడు పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బొజ్జల తన అనుచరుడు సుజిత్‌రెడ్డితో తనను సంప్రదించి కోట వినుత, ఆమె భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని సూచించినట్లు రాయుడు ఆరోపించాడు. వారి హత్యకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపాడు. 2024 ఎన్నికలకన్నా ముందే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించారని వీడియోలో వెల్లడించాడు. గతంలో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అతడు సొంతంగా వీడియో రికార్డ్ చేశాడా, లేక భయపెట్టి వీడియో తీయించారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.





















