Food Poison: బీసీ బాయ్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్, 15 మందికి అస్వస్థత - శ్రీకాళహస్తిలో ఘటన
Tirupati News Today | శ్రీకాళహస్తి లోని బిసి బాలుర హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Food Poison News| శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బిసి బాయ్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో హాస్టల్ వార్డెన్ వెంటనే విద్యార్థులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రుయా ఆసుపత్రి కి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటన తెలిసిన వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.






















