Chittoor News: దూడను నోటితో కొరికి చంపిన వ్యక్తి - నిందితుణ్ని కట్టేసిన గ్రామస్థులు
Telugu News: దూడను వ్యక్తి కొరికి చంపిన ఈ దారుణ ఘటన కుప్పం సమీపంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఒంటిపల్లికి చెందిన సుబ్రమణి అని గ్రామస్థులు చెప్పారు.
AP Latest News: చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైనా మనుషులు మనుషుల్ని హత్య చేయడం చూస్తుంటాం. క్షణికావేశంలోనో లేదా పగబట్టి పథకం ప్రకారమో ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. కానీ, చిత్తూరు జిల్లాలో మాత్రం ఓ వ్యక్తం ఓ దూడను చంపాడు. కుప్పం సమీపంలోని బిసానత్తం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏకంగా ఓ లేగ దూడను ఆ వ్యక్తి నోటితో కొరికి హతమార్చినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన వ్యక్తిని ఒంటిపల్లికి చెందిన సుబ్రమణి అని గ్రామస్థులు చెప్పారు. దీంతో వెంటనే దూడను హతమార్చిన వ్యక్తిని గ్రామస్థులు బంధించారు. అతణ్ని ఓ గుంజకు కట్టేసి కొట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని నిందితుడైన సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నారు. దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.