Baba Ramdev: మమదనపల్లెలోబాబా రామ్‌దేవ్ పర్యటన- హార్స్‌లీ హిల్స్‌లో అంతర్జాతీయ ప్రాజెక్టు!
Baba Ramdev: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అంతర్జాతీయ వెల్‌సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన స్థలాన్ని యోగా గురువు బాబా రామ్‌దేవ్ పరిశీలించారు.

Baba Ramdev: ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మదనపల్లెకు సమీపంలోని హార్స్‌లీ హిల్స్‌లో వెల్‌నెస్ సెంటర్ విషయంపై స్థానిక అధికారులతో చర్చించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని హార్స్‌లీహిల్స్‌లో రామ్‌దేవ్‌బాబా ఇంటర్‌నేషనల్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. అందుకే మదనపల్లెలో పర్యటించి అధికారులతో చర్చించారు. స్థలాన్ని పరిశీలించారు.
మదనపల్లెలో స్థలాన్ని పరిశీలించిన అనంతరం రామ్‌దేవ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. హార్సిలీహిల్స్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వెల్‌నెస్ సెంటర్ అవుతుందని తెలిపారు.
గత నవంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రామ్‌దేవ్ బాబా కలిశారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి చాలా విషయాలపై చర్చించారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిగినట్టు అప్పట్లో చంద్రబాబు ట్వీట్ చేశారు. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టుకూడా పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రామ్‌దేవ్ బాబా అండ్ స్థలాలు పరిశీలించారు.





















