Roja On Pawan Varahi: పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు అది నారాహి: ఏపీ మంత్రి రోజా ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు అది నారాహి అని ఏపీ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీ అన్నారు.
- పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి
- కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితి
- 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీ
- ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారు
- వారాహి రంగుపై పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారు
- పవన్, చంద్రబాబులను హైదరాబాద్ కు జగన్ పంపడం ఖాయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు అది నారాహి అని ఏపీ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. తిరుపతిలో శనివార ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్ధిర పర్యాటక ప్రణాళిక, అభివృద్ధిపై జరిగిన సౌత్ జోన్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని, పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని ఏపి పర్యాటక శాఖా మంత్రి రోజా తెలియజేశారు.
2023లో పర్యాటక రంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతాం అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయని, కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి రోజా తెలిపారు. ఐటిపిఐ సలహాలు, సూచనలు తీసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి అని రోజా ఎద్దేవా చేశారు. కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని, ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నట్లు ఉందని, వారాహి రంగుపై పవన్ కళ్యాణ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనాసేన పార్టీనే అని ఆమె విమర్శించారు..
అది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్.. మేం కాదు
పవన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదని, మీడియా అనవసరంగా పవన్ కు ప్రాధాన్యత ఇస్తోందని కొట్టిపడేశారు. హైదరాబాద్ లో నివసించే పవన్, శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ అని, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం దత్త పుత్రుడు పని చేస్తున్నాడని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్ కు సీఎం జగన్ పంపడం ఖాయంమన్నారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని, పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలపైనా పార్టీ పైనా ప్రేమ లేదని మంత్రి రోజా విమర్శించారు.
వైఎస్ఆర్‌సీపీ తన విషయంలో అన్నింటినీ వివాదాస్పదం చేయడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తీసుకున్నారు. కారు to కట్‌డ్రాయర్.. YCP టిక్కట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి AP అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే AP లో వీరి లంచాలు, వాటాలు వేధింపులవలన “ కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్.. అని వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేయడం తెలిసిందే.