Payyavula Keshav: మద్యం ఆరోగ్యానికి హానికరం- వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరం: పయ్యావుల కేశవ్
Payyavula Keshav: లిక్కర్ స్కామ్‌లో అవినీతి బాగోతం బయటపడుతుందనే జగన్ మోహన్ రెడ్డి టెన్షన్ పడుతున్నారని అన్నారు పయ్యావుల కేశవ్. వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరని కామెంట్ చేశారు.

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలనపై విమర్శలు చేసిన వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం ఆరోగ్యానికి ఎంత హానికరమో వైసీపీ పాలన కూడా ఆంధ్రప్రదేశ్‌కు అంతే హానికరమని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తిత్వం కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పయ్యావుల కేశవ్ జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అప్పులు గురించి మాట్లాడుతున్న జగన్ తన హయాంలో చేసిన వాటికి వడ్డీలు ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో వస్తున్న నిజాలు చూసి షాక్‌లో ఉన్నారని అన్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి తిరిగి తమపై నిందలు వేస్తున్నారని తెలిపారు.
మద్యం ఆరోగ్యానికి హానికరమని ఇప్పటి వరకు చూశామని ఇకిపై వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరమనే స్లోగన్ ప్రజలకు చెబుతున్నారని అన్నారు పయ్యావుల. అమరావతిలో భూమి సేకరిస్తుంటే రాజధాని అభివృద్ధి ఆపడానికి జగన్ చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ లేదు అని జగన్ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేకపోవడంతోనే రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు.
ప్రస్తుతం ఉన్న లిక్కర్ పాలసీ దాదాపు 50,60 ఏళ్ల క్రితమే పెట్టిందని పయ్యావుల గుర్తు చేశారు. జగన్ నాన్న రాజశేఖర్ రెడ్డి పాలనలో కూడా ఇదే పాలసీ కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న బ్రాండ్లే అమ్ముతున్నారని వివరించారు. జగన్‌లా బూమ్ బూమ్‌లు ప్రెసిడెంట్ లిక్కర్ ఇతరత్రా బ్రాండ్లు అమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు హానికరమైన బ్రాండ్లు రాష్ట్రంలో అమ్మడం లేదని స్పష్టం చేశారు. లిక్కర్‌లో జగన్ అవినీతి అంత బయటపడుతోందని అభిప్రాయపడ్డారు.
ఇసుక ఫ్రీ ఇస్తామని ప్రకటించిన తొలి నేత చంద్రబాబు నాయుడని అన్నారు పయ్యావుల. పర్మిట్ల ప్రకారమే రాష్ట్రంలో మైనింగ్ జరుగుతుందనని తెలిపారు. రివర్స్ టెండరింగ్ చేసి పోలవరం ప్రాజెక్టు ఖర్చును మూడు రెట్లు పెరిగిందని అన్నారు. జగన్‌కు భయతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో మూడు లక్షల ఎకరాలు రికార్డు లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్ చేశారని వివరించారు.
జగన్ చేసిన పనికి అధికారులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు పయ్యావుల. రాష్ట్ర సంపద కోసం.. రాష్ట్ర యువత ఉద్యోగుల కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకు కూటమి ప్రభుత్వ దగ్గర సమాధానం ఉంది జగన్ అని తెలిపారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అప్పులు,వడ్డీలు ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు.
94 కేంద్ర పథకాలను బంద్ చేసింది జగన్ మోహన్ రెడ్డి కాదా అని పయ్యావుల ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన తప్పులకు వడ్డీలు కట్టడానికే అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. నాడు బ్రాండిక్స్ కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రూపాయికి భూములు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.





















