అన్వేషించండి

TTD Funds For Tirupati: టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం- హిందూ సంస్థల విజయమన్న విష్ణువర్ధన్ రెడ్డి

TTD Funds News: తిరుపతి అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వినియోగించాలన్న యోచనపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది.

TTD Funds For Tirupati Rejects:

తిరుపతి: తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించాలన్న ఆలోచనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో టీటీడీ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి 1 శాతం శ్రీవారి ఆలయ నిధులను వెచ్చించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది సరికాదంటూ పెద్ద ఎత్తున ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో  టీటీడీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

హిందు ధర్మంలో భక్తులు దేవుడికి తమ సంపాదనను భక్తితో హుండీలో మొక్కులుగా సమర్పణ చేసే కానుకల విషయంలో హిందూ సమాజంలో గట్టి విశ్వాసాలు ఉంటాయని భక్తులు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ  హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ, వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరు. చివరికి భక్తులు ముడుపు కట్టిన సొమ్ములు కూడా దేవునికి తప్ప మరే కార్యక్రమం కోసం వాడరని తెలిసిందే. దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులుకు మాత్రమే వినియోగిస్తారు. కానీ తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక ఆలయ ఆదాయంలో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని టీటీడీ ప్రతిపాదన పంపింది. దీనిపై ప్రతిపక్షాలతో పాటు భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడం, విమర్శల వెల్లువతో సర్కార్ మనసు మార్చుకుంది. టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది.

TTD Funds For Tirupati: టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం- హిందూ సంస్థల విజయమన్న విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల భక్తులు, హిందు సంస్థల విజయం !
టీటీడీ ఆదాయంలో ఒక్క శాతం నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న పాలక మండలి సిపారసును ఏపీ ప్రభుత్వం నేడు తిరస్కరించడం ఇది శ్రీవారి భక్తులు, హిందుసంస్థల గొప్ప విజయమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారికి తాము భక్తితో ముడుపు కట్టి ఇచ్చే కానుకల్ని  భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగించడం భక్తులను గౌరవించడం అన్నారు. 

టీటీడీ పాలకమండలిలోని కొంత మంది సభ్యులు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ భక్తులు ఆందోళన చెందారు. ఈ అంశంపై భక్తుల ఆందోళనను విష్ణువర్దన్ రెడ్డి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రభుత్వం భక్తుల ఆందోళనను వెంటనే గుర్తించి టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించడం మంచిదేనన్నారు. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి.. శ్రీవారి నిధుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. హిందూ సమాజం , పీఠాధిపతులు మరియు హిందు సమాజంలో పెద్దలతో మేథోమథనం జరపిన తర్వాతనే నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచంలోని హిందువులందరికీ శ్రీవారికి ఆరాధ్యదైవం. అందుకే అందరూ ఆయనకు తృణమో, పణమో సర్పించుకుంటారు.  భక్తుల ఉద్దేశం ఆ సొమ్మును ప్రభుత్వాలో లేకపోతే మరొక వ్యవస్థో తీసుకుని ఖర్చు పెట్టాలని కాదు.  నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా ఆయా కార్యక్రమాలకే వారు విరాళిచ్చేవారు. వారి ఉద్దేశం శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. హిందూ ధర్మ ప్రచారం చేయడం. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget