అన్వేషించండి
Tirumala Tirupati Laddu: లడ్డూ వివాదంపై ప్రభుత్వం సీరియస్- సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!
Tirumala Laddu: తిరుమల లడ్డూలో ఏం జరిగిందో పూర్తిస్థాయి రిపోర్టును సాయంత్రంలోపు ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

లడ్డూ వివాదంపై ప్రభుత్వం సీరియస్- సాయంత్రంలోపు రిపోర్ట్ చంద్రబాబు ఆదేశం!
Source : X
Tirupati Laddu Contriversy: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారి ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సాయంత్రం లోపు రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందే పూర్తి వివరణతో రిపోర్టు ఉండాలని సూచించారు.
ఇంకా చదవండి
Advertisement






















