By: ABP Desam | Updated at : 02 Mar 2023 09:14 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల నిత్యఅన్నప్రసాదం
TDP Vs TTD : తిరుమల వెంగమాంబ నిత్య అన్న ప్రసాదంపై వచ్చిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. అన్నప్రసాదంపై తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలను టీటీడీ తప్పుబట్టింది. అన్నప్రసాదం బాగోలేదంటూ ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ ఓ వీడియో పోస్టు చేసింది. టీటీడీపై దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ హెచ్చరించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తుల వద్దకు నేరుగా వెళ్లి అభిప్రాయాలు సేకరించారు. ఈ వీడియో భక్తులు అన్నప్రమాదం బాగుందని, అన్నం బాగా ఉడికిందని చెప్పారు. అన్నప్రసాదంపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా చేయడం తగదని టీటీడీ తెలిపింది. స్వామి వారి ఖ్యాతిని, ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలని సూచించింది.
టీడీపీ ఆరోపణలు
తిరుమల వెంకన్నని, ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని తెలుగుదేశం ఓ వీడియో పోస్టు చేసింది. ఎవరితో అయినా పెట్టుకోండి, తిరుమల వెంకన్నతో మాత్రం పెట్టుకోకండి, భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండని తెలిపింది. టీడీపీ పోస్టు చేసిన వీడియో ఓ వ్యక్తి తిరుమల వెంగమాంబ నిత్య అన్నప్రసాదంలో అన్న సరిగాలేదని తెలిపాడు. రేషన్ బియ్యం వండుతున్నారని, వాటినే మంత్రులు, టీటీడీ ఈవో, ఛైర్మన్ తినాలన్నారు. భక్తులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపణలు చేశారు.
తిరుమల వెంకన్నని, ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు.
ఎవరితో అయినా పెట్టుకోండి, ఆయనతో మాత్రం పెట్టుకోకండి. భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండి. pic.twitter.com/LkhNELlihB — Telugu Desam Party (@JaiTDP) March 2, 2023
తిరుమలలో దళారులకు చెక్
తిరుమలలో మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. ఫొటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేయనుంది. గదుల కేటాయింపు సమయంలో ఫొటో క్యాప్చర్ తీసుకుంటున్నారు. గదులు ఖాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయినా ఫొటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ అకౌంట్ లో జమ చేస్తారు. రూమ్ రొటేషన్ విధానం ఆగిపోవడంతో త్వరిత గతిన సామాన్య భక్తులకి గదులు త్వరగా అందించగలుతోంది. గతంలో దళారుల చేతివాటంతో గదుల రొటేషన్ విధానం సాగుతూ వచ్చిన.... ఇప్పుడు ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ద్వారా దళారులు గదులు పొందే అవకామే లేదు. ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టామని, లడ్డు మిస్యూస్ కాకుండా ఉండేందుకు ఈ విధానం పనిచేయనుంది అధికారులు తెలిపారు.
15 రోజుల పాటు ప్రయోగాత్మక పరిశీలన
తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ అమలుతో అసలేన భక్తులు గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దీంతో దళారులు తగ్గారన్నారు. తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం, సీఆర్వో, ఎంబీసీ ప్రాంతాల వద్ద భక్తులకు గదులను కేటాయించే కౌంటర్ల వద్ద ఈవో ధర్మారెడ్డి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని గురువారం పరిశీలించారు. మరో 15 రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు త్వరలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా టోకెన్లు అందజేస్తా్మన్నారు. తిరుమలలో దళారులను పూర్తిగా తగ్గించేందుకు, టీటీడీ సౌకర్యాలు భక్తులకు అందించేందుకు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తిరుమలలో సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గదులను రొటేషన్ చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని చెప్పారు. గదుల కోసం పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు తొందరగా రూములు దొరుకుతున్నాయని ఈవో తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ