News
News
X

Roja Vs Janasena : మంత్రి రోజా నాపై కక్షగట్టారు, 16 నెలల తర్వాత అదే స్టేషన్ లో రోజాను కూర్చోబెడతాం - కిరణ్ రాయల్

Roja Vs Janasena : తిరుపతి జిల్లాలో మంత్రి రోజా వర్సెస్ జనసేన నేతలకు మధ్య వార్ పీక్స్ కు చేరింది. జనసేన నేత కిరణ్ రాయల్ ను అరెస్టు చేసేంత వరకు వెళ్లింది.

FOLLOW US: 
 

Roja Vs Janasena : తిరుపతి జిల్లాలో రాజకీయ వేడి రసోత్తరంగా సాగుతుంది. ఓ వైపు అధికార పార్టీ బలప్రయోగం కోసం చూస్తుంటే, మరో వైపు జనసేన నాయకులు ప్రతిఘటిస్తూ  మంత్రి రోజాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ , ఇతర పార్టీ నేతలపై అధికార పార్టీ గురిపెట్టిందని జనసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంత కాలంగా రోజా వర్సెస్ కిరణ్ రాయల్ మాటల యుద్ధం కొనసాగుతోంది. రోజా పవర్ ను ఉపయోగిస్తే కిరణ్ రాయల్ రోజాను ప్రతిఘటిస్తూ విమర్శలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంత్రి రోజా మీడియా ముఖంగా మాట్లాడిన అనంతరం కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రోజాను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. శుక్రవారం రాత్రి కిరణ్ రాయల్ ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయింది. స్టేషన్ పేరు చెప్పని పోలీసులు మఫ్తీలో వచ్చి నెంబర్ ప్లేట్ లేని వాహనంలో కిరణ్ రాయల్ ను ఎక్కించుకుని రాత్రంతా తిరుపతి మొత్తం తిప్పారు. అర్ధరాత్రి సమయంలో నగిరి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు.  

అసలేం జరిగింది? 

ఏపీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి జనసేన నాయకులకు మధ్య కొంత కాలంగా వార్ నడుస్తుంది. ఒకరిపై మరొకరు రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి రోజాపై విశాఖపట్నంలో జనసేన నాయకులు జరిపిన దాడి సందర్భంగా వీరి విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 18న మంత్రి ఆర్.కే.రోజా ఫిర్యాదుతో తిరుపతి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై నగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో నిన్న రాత్రి కిరణ్ రాయల్ ఇంటి వద్దకు దాదాపు 11 మంది పోలీసులు మఫ్తీలో చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. తాము రేణిగుంటకు చెందిన పోలీసులమని చెప్పి నోటీసు జారీ చేసి కిరణ్ రాయల్‌ ను వాహనంలో ఎక్కించుకుని తిరుపతి మొత్తం తిప్పి రోజాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళలో నగిరి పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు ఐపీసీ 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి అరెస్టు 

News Reels

అనంతరం నగిరి‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసుల ఆరోపణలను పరిశీలించిన మెజిస్ట్రేట్ కిరణ్ రాయల్ కు బెయిల్‌ మంజూరు చేశారు. తరువాత కిరణ్ రాయల్, జనసేన నాయకులతో కలిసి మంత్రి ఆర్.కే.రోజా ఇంటి ముందు టపాసులు పేల్చి " తొడలు కొట్టి సవాల్" చేశారు. రోజాకు వ్యతిరేకంగా జనసైనికులు నినాదాలు చేశారు. అనంతరం కిరణ్ రాయల్ తిరుపతిలోని ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 18న  తనపై కేసు నమోదు చేశారని, ఒక టెర్రరిస్ట్ లా లాక్కొని దొంగ చాటుగా పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ మంత్రి రోజా తనపై కక్ష కట్టి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. పోలీసులు ఎవరో చెప్పకుండా తన ఇంట్లో దూరి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని, 11 మంది పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి అరెస్ట్ చేశారని చెప్పారు. 

మంత్రి రోజాదే బాధ్యత  

"వాహనంలో నన్ను ఎక్కించుకొని తిరుపతి మొత్తం తిప్పారు. తరువాత మంత్రి రోజాకి కాల్ చేసి నా దగ్గర మాట్లాడించారు. నన్ను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా కేసులు పెడుతున్నానని రోజా నాతో చెప్పారని, రోజాతో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నాపై కక్ష కట్టి అరెస్ట్ చేయించారు.  ప్రతి అర గంటకు ఒక్కసారి మంత్రి రోజా పోలీసు అధికారులకు కాల్ చేసి రాత్రి నుంచి అనేక సెక్షన్స్ పెట్టించారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక సెక్షన్లు మార్చారు. మంత్రి రోజాపై కేసు పెడతామని, 16 నెలల తరువాత నన్ను కూర్చోబెట్టిన స్టేషన్ లోనే రోజాను కూర్చోబెడతామన్నారు. ఇంతటితో ఆపితే సరి లేకుంటే యుద్ధం మొదలెడతాంయ  నాకు, మా కుటుంబానికి ఏమి జరిగినా రోజాదే బాధ్యత. "- కిరణ్ రాయల్ 

Published at : 12 Nov 2022 06:57 PM (IST) Tags: AP News Janasena Tirupati Minsiter roja kiran royal

సంబంధిత కథనాలు

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

GVMC Recruitment: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!

GVMC Recruitment: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

టాప్ స్టోరీస్

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా